ETV Bharat / state

Huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

author img

By

Published : Oct 1, 2021, 12:55 PM IST

Updated : Oct 1, 2021, 1:15 PM IST

trs candidate gellu Srinivas Yadav nomination for the Huzurabad by-election 2021
Huzurabad by election: హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

12:52 October 01

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ ఉపఎన్నికకు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్​ వేశారు. ఆర్డీవో కార్యాలయంలో నామపత్రాలు దాఖలు చేశారు. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంది. 

గెల్లు ప్రస్థానం..

ఎంఏ, ఎల్ఎల్​ల్బీ, రాజనీతి శాస్త్రంలో పీహెచ్​డీ చేసిన గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీనివాస్​పై 100కు పైగా కేసులు ఉండగా.. ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. రెండు సార్లు జైలుకు వెళ్లి 36 రోజులు చర్లపల్లి, చంచల్ గూడలో జైలు జీవితం గడిపారు. 2017 నుంచి టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఉపఎన్నిక వివరాలిలా...

ఇటీవలే హుజూరాబాద్​ ఉపఎన్నిక(Huzurabad By Election 2021) షెడ్యూల్ వచ్చింది. ఉపఎన్నికకు అక్టోబర్ 2న నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అక్టోబర్ 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరపనున్నట్లు తెలిపింది. వాటి ఉపసంహరణకు 13వ తేదీ వరకు గడువు విధించింది. అక్టోబర్ 30న హుజూరాబాద్ ఉపఎన్నిక(Huzurabad By Election Polling 2021) పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు తెలిపింది.

ఈటల రాజీనామాతో ఎన్నిక అనివార్యం

రాష్ట్ర మాజీ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్​ నియోజకవర్గం(Huzurabad By Election 2021)లో ఉపఎన్నిక వచ్చింది. ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి నియోజకవర్గంలో రాజకీయం రంజుగా మారింది. ఇటు అధికార తెరాస, అటు భాజపా నేత ప్రచారాల(Huzurabad By Election Campaign 2021)తో హోరెత్తుతోంది. ఇప్పటికే తెరాస మంత్రి హరీశ్ రావు నియోజకవర్గంలోనే ఉండి.. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటున్నారు. రోజుకో వర్గానికి సంబంధించి ఆత్మీయ, సమ్మేళన సభలు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో తెరాసపై పాజిటివ్ టాక్ తీసుకొస్తున్నారు.

నేడు అభ్యర్థి ప్రకటన..

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో పోటీ చేసే అభ్యర్థి పేరును కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం అధికారికంగా ఖరారు చేయనుంది(congress candidate to be announced on today). సీఎల్పీ కార్యాలయంలో గురువారం సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క(mallu batti vikramarka), పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహా, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌లు ఈ అంశంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. మాజీ మంత్రి కొండా సురేఖ, కవ్వంపల్లి సత్యనారాయణ, రవికుమార్‌, కృష్ణారెడ్డి పేర్లను ఇప్పటికే ఏఐసీసీకి పంపారు. హుజూరాబాద్​ అభ్యర్థి కోసం 19 దరఖాస్తులు వచ్చినట్టు రాజనర్సింహా వెల్లడించారు. సామాజిక వర్గాల వారీగా నలుగురి పేర్లతో నివేదిక తయారు చేసినట్టు వివరించిన రాజనర్సింహ.. భట్టి విక్రమార్కతో కలిసి పీసీసీకి నివేదించినట్టు తెలిపారు.

ఇదీ చూడండి: Huzurabad: ఎవరీ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌... కేసీఆర్ ఆయన్నే ఎందుకు ప్రకటించారు?

Last Updated : Oct 1, 2021, 1:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.