ETV Bharat / state

నగరంలో నీరు ఆకుపచ్చగా వస్తోంది!

author img

By

Published : Apr 8, 2021, 8:32 AM IST

కరీంనగర్‌‌లో ప్రజలకు సరఫరా అయ్యే నీరు కలుషితంగా ఉంటోందని స్థానికులు వాపోతున్నారు. మధ్య మానేరు ప్రాజెక్టు పరిధిలో పురాతన ఇళ్లు, ఇతర వ్యర్థాల కారణంగా మిషన్​ భగీరథ అధికారులు ఈ నెల 30 వరకు నీటి సరఫరాను పలు ప్రాంతాలకు నిలిపివేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

karimnagar city, polluted drinking water
నగరంలో నీరు ఆకుపచ్చగా వస్తోంది!

రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టులో నీరు అడుగంటి పోవడంతో తాగునీటికి సరికొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 25 టీఎంసీలతో నిండుకుండను తలపించిన ప్రాజెక్టులో.. నీటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తుండటం వల్ల ప్రస్తుతం 16 టీఎంసీలకు అడుగంటింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో కుదురుపాక, నీలోజుపల్లితోపాటు మొత్తం 13 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.

ఆ గ్రామాలకు సంబంధించిన పురాతన ఇళ్లు, ఇతర వ్యర్థాలతో నీరు కలుషితంగా మారినట్లు గుర్తించారు. అక్కడి నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరా చేస్తుంటారు. ప్రస్తుతం మలినాలతో కూడిన నీరు వస్తుండటం వల్ల నీటిని శుద్ది చేయడం సాధ్యం కాదని.. తాగడానికి ఈ నీరు పనికి రావని గత నెల 30 నుంచి సరఫరాను నిలిపివేశారు.

ప్రస్తుతం నీటి నమూనాలను కాలుష్య నియంత్రణ మండలికి పంపిచామని.. ఆ నీరు తాగడానికి పనికి వస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతనే సరఫరా చేస్తామని.. మిషన్‌భగీరథ అధికారులు పేర్కొన్నారు. మధ్య మానేరు నుంచి దిగువ మానేరుకు కూడా ఇప్పటి వరకు నీటిని తరలించిన దృష్ట్యా.. కరీంనగర్‌‌ నగరంలో సరఫరా అయ్యే నీరు కూడా ఆకుపచ్చగా ఉంటోందని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి.

ఇదీ చూడండి : షర్మిల బహిరంగ సభకు ముమ్మరంగా కొనసాగుతున్న ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.