ETV Bharat / state

'పనిలేక కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు.. మాట ఇస్తే నిలబెట్టుకుంటాం'

author img

By

Published : Feb 14, 2022, 1:45 PM IST

KTR Mustabad Visit for Double bedroom Houses : సీఎం కేసీఆర్​పై కొందరు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం మాట ఇచ్చిందంటే... నిలబెట్టుకుని తీరుతుందని స్పష్టం చేశారు. దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్​దేనని పేర్కొన్నారు. కరీంనగర్‌ ముస్తాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు.

KTR Mustabad Visit for Double bedroom Houses, ktr comments
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేటీఆర్

KTR Mustabad Visit for Double bedroom Houses: ముఖ్యమంత్రి కేసీఆర్​పై కొందరు పనిలేక ఆరోపణలు చేస్తున్నారని.... వారు దేశంలో ఎక్కడైనా రెండు పడక గదుల ఇళ్లు ఉంటే చూపించాలని మంత్రి కేటీఆర్ సవాల్‌ చేశారు. కరీంనగర్‌ ముస్తాబాద్‌లో డబుల్‌ బెడ్‌ రూము ఇళ్లను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు. దేశంలో ఆదర్శవంతమైన పథకాలు తెచ్చిన ఘనత కేసీఆర్​దేనని... దేశానికే దిక్సూచి వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇల్లు అందిస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్క సారి మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుందని వ్యాఖ్యానించారు.

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నాం. 24 గంటలు విద్యుత్‌ సరఫరా కేసీఆర్‌ దూరదృష్టితోనే సాధ్యం. త్వరలోనే అర్హులైన పేదలందరికీ రెండుపడక గదుల ఇళ్లు ఇస్తాం. కేసీఆర్‌ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే నిలబెట్టుకుని తీరుతుంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలపై అందరికీ అనుమానాలు ఉండేవి. ఎవరైనా ఇళ్ల కోసం డబ్బులు అడిగితే లాగి కొట్టండి. ఇళ్లు రాని వాళ్లు ఉంటే బాధపడవద్దు. నాణ్యమైన ఇళ్లు ఇవ్వాలన్నదే మా సంకల్పం. రెండు పడకగదుల ఇళ్లు ప్రైవేటు బిల్డర్‌ నిర్మిస్తే రూ.25లక్షలు అయ్యేవి. రూ.25లక్షల విలువైన రెండు పడకగదుల ఇళ్లను ఉచితంగా ఇస్తున్నాం.

- మంత్రి కేటీఆర్‌

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద రూ.8500 కోట్లు అందజేశామన్న కేటీఆర్‌... ఆడబిడ్డలకు 11లక్షల కేసీఆర్‌ కిట్లు అందించామని తెలిపారు. కొందరు పనిలేక కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారన్న మంత్రి... దేశంలో ఎక్కడైనా రెండు పడకగదుల ఇళ్లు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు.

ఇదీ చదవండి: President Ramnath Kovind : హైదరాబాద్‌లో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.