ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్.. దిగుమతులు తగ్గించిన చైనా.. తల్లడిల్లుతున్న పత్తి రైతులు

author img

By

Published : Jan 7, 2023, 8:43 AM IST

Updated : Jan 7, 2023, 11:01 AM IST

Cotton price drops in Telangana : అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులు... పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ... సరైన ధర లేకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈఏడాది పెట్టుబడి సైతం పెరింగిదని..తక్కువ అమ్మలేక పంటని ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకులు... పత్తి రైతుల పాలిట శాపంగా మారాయి. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నప్పటికీ... సరైన ధర లేకపోవడంతో తల్లడిల్లిపోతున్నారు. గతంతో పోలిస్తే ఈఏడాది పెట్టుబడి సైతం పెరింగిదని..తక్కువ అమ్మలేక పంటని ఇంట్లోనే నిల్వ చేసుకుంటున్నారు.

Cotton price drops in Telangana
Cotton price drops in Telangana

దిగుమతులు తగ్గించిన చైనా తల్లడిల్లుతున్న పత్తి రైతులు

Cotton price drops in Telangana : పత్తి రైతులు కష్టాలు నానాటికీ తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్టంలో గత ఏడాది కురిసిన అకాలవర్షాలతో నష్టపోయిన రైతలకు.... పత్తి విక్రయించే సమయానికి కొత్తకష్టాలు వస్తున్నాయి. భారత్‌ నుంచి పత్తి దిగుమతి చేసుకునే ప్రధాన దేశమైనా చైనాలో... కరోనా విలయతాండవం చేస్తోంది. ఆ దేశం పత్తి దిగుమతి తగ్గించింది. అంతర్జాతీయ విపణిలోనూ తెల్ల బంగారానికి ఆదరణ లేకపోవటంతో.... ఎగుమతులు భారీగా తగ్గాయి. పత్తిరైతులు గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ ఏడాది ప్రారంభం నుంచి మొదలుకొని ఇప్పటివరకు కేవలం 7 వేల నుంచి 8వేల రుపాయలు వరకూ మాత్రమే పత్తి ధర పలికింది. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మార్కెట్‌కు పత్తి అంతంతమాత్రంగానే వస్తోంది. 2021లో ఈ సమయానికి.... పత్తి క్వింటా ధర 10వేల వరకు పలికింది. వ్యాపారులు సైతం పెద్దఎత్తున పత్తిని కొనుగోలు చేశారు. 2021 మార్చి, ఏప్రిల్‌ నాటికి ఏకంగా క్వింటాకు 14 వేల నుంచి 15వేల రుపాయల వరకు వచ్చింది. ఈ ఏడాది సైతం ధర అలాగే ఉంటుందని భావించిన రైతన్న... మార్కెట్‌కు వచ్చిన కంగుతినే పరిస్థితి ఏర్పడింది. డిసెంబర్‌ చివరి వారం నుంచి కొంత ధర పెరిగి.... 8వేల 400కు చేరినా... మళ్లీ ధర తగ్గడంతో రైతులకు నిరాశే ఎదురైంది.

"కౌలు రేటు పెరిగింది. కూలీ రేట్లు పెరిగినయి. ఎరువల ధరలు పెరిగాయి. కానీ పత్తి రేటు మాత్రం తగ్గింది. గతేడాది 14 వేలు ఉన్న ధర.. ఈ ఏడాది రూ.9వేలకే పరిమితమైంది. అకాల వర్షాల వల్ల ధర తగ్గిస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇప్పటి ధరతో పెట్టుబడి రావడం కూడా కష్టమే. మాకు లాభాలేం రావు. కనీసం పెట్టుబడైనా వచ్చేటట్టు పత్తికి మద్దతు ధర పెంచాలి. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి మా సమస్య పరిష్కరించాలి." - పత్తి రైతులు

"మన దేశంలో పండే 80 శాతం పత్తి పంట బంగ్లాదేశ్, చైనాకు వెళ్తుంది. కానీ ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభించడం వల్ల అక్కడ 25 శాతం మాత్రమే కాటన్ పరిశ్రమలు తెరిచి ఉన్నాయి. అందుకే అక్కడికి ఎగుమతి తగ్గింది. ఇక్కడ ధర తగ్గిపోయింది." - బాలచంద్ర, జిన్నింగ్ మిల్లు యజమాని

ప్రస్తుత సీజన్‌లో విదేశాలకు ఎగుమతులు తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఈ సమయానికి పత్తి బేళ్లు చాలా ఎగుమతులు చేశామంటున్నారు. ఇప్పుడు ఆపరిస్థితులు లేవని తెలిపారు. కరోనా వల్ల చైనా పత్తి దిగుమతి దాదాపు ఆపేసిందని తెలిపారు. గతంలో 134 బేళ్లు ఎగుమతి చేస్తే 75 నుంచి 80లక్షలు రుపాయలు వచ్చేవని... ప్రస్తుతం కేవలం 43 లక్షలే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతులు నిలిచిపోవడంతో.. ఇప్పటికే కొనుగోలు చేసిన పత్తిని మిల్లుల్లోనే నిల్వ చేస్తున్నామని వివరించారు. పెట్టుబడుల భారంతో కుదేలైన పత్తి రైతులకు.... కనీస గిట్టుబాటు ధర సైతం లభించకపోవటం తీవ్ర ఇబ్బందిగా మారింది.

Last Updated : Jan 7, 2023, 11:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.