ETV Bharat / state

విధులకు ఆటంకమని అధికారులు.. అనుమతి లేదని గ్రామస్థులు

author img

By

Published : Jun 28, 2019, 7:46 PM IST

కామారెడ్డి జిల్లాలోని సోమూర్​ గ్రామస్థులు, విద్యుత్​ శాఖ అధికారులు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. విద్యుత్​ చౌర్యంపై తనిఖీలు నిర్వహిస్తుండగా అడ్డుకుని దాడికి పాల్పడ్డారని గ్రామస్థులపై ఆధికారులు ఫిర్యాదుచేశారు. అనుమతి లేకుండా ఇళ్లలోని ప్రవేశించారని విద్యుత్​ శాఖ అధికారులపై సోమూర్​ గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

విధులకు ఆటంకమని అధికారులు.. అనుమతి లేదని గ్రామస్థులు

విధులకు ఆటంకమని అధికారులు.. అనుమతి లేదని గ్రామస్థులు

కామారెడ్డి జిల్లా మద్నూర్​ మండలం సోమూర్​లో గ్రామస్థులకు, విద్యుత్​ శాఖ అధికారుల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతోంది. తమ అనుమతి లేకుండా విద్యుత్​ శాఖ అధికారులు ఇళ్లలోని ప్రవేశించారంటూ గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని గ్రామస్థులపై విద్యుత్​ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.

గత వారంలో విద్యుత్​ చౌర్యాన్ని గుర్తించేందుకు ఆ శాఖ అధికారులు సోమూర్​ గ్రామానికి వెళ్లారు. వారిని అడ్డుకున్న గ్రామస్థులు.. జుక్కల్​ సబ్​ ఇంజినీర్​ నవీన్​తో పాటు ఆరుగురు ఏఈలు, ఇతర అధికారులపై దాడి చేశారు. రెండు రోజుల క్రితం మరోసారి సోమూర్​ గ్రామంలో ఇళ్లలో ఏర్పాటుచేసిన విద్యుత్​ మీటర్లను బయట అమర్చేందుకు ప్రయత్నించగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇరువురు మరోసారి పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.

ఇవీ చూడండి: పంట నష్టపోతే రైతులకు పరిహారం అందిస్తాం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.