ETV Bharat / state

'రక్షిత ఆత్మహత్య చేసుకోడానికి ర్యాగింగ్​ కారణం కాదు'

author img

By

Published : Feb 27, 2023, 4:32 PM IST

Police explanation in case of Rakshita suicide: వరంగల్​లో వేధింపులు తట్టుకోలేక బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్​ కారణంగానే ఆత్మహత్య చేసుకుందని వైరల్​ అవుతుంది. ఈ విషయంలో పోలీసులు స్పందించి ర్యాగింగ్​ కారణంగా చనిపోలేదని స్పష్టతనిచ్చారు.

BTech student protected
బీటెక్ విద్యార్థిని రక్షిత

Police explanation in case of Rakshita suicide: రక్షిత ఆత్మహత్యకు కారణం ర్యాగింగ్ కాదని ఇన్​స్పెక్టర్​ మల్లేశం క్లారిటీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్న విషయాలు తప్పు అని చెప్పారు. ఇన్‌స్పెక్టర్‌ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి పరిచయమున్న రాహుల్​, జశ్వంత్​ వేధింపుల కారణంగానే రక్షిత ఆత్మహత్య చేసుకుందని వారి తల్లిదండ్రులు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వారి ఇద్దిరిపై కేసు నమోదు చేసుకుని, ఆత్మహత్యకు కారణాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కొంత మంది సామాజిక మాధ్యమాల్లో ర్యాగింగ్​ అని ప్రచారం చేస్తున్నారు. అది తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు.

కాలేజ్​కి, నిందితులకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్లు ఆ కాలేజ్​లో చదవట్లేదని తెలిపారు. పోలీసులు కొన్ని బృందాలుగా విడిపోయి నిందితులని వెతుకుతున్నామని చెప్పారు. వారిపై గతంలో కూడా ఇలాంటి కేసులు ఉన్నాయా? లేదా? అని ఆరాతీస్తున్నామని అన్నారు. భూపాలపల్లి పోలీసులను సంప్రదించామని.. ఏమైనా కేసులు ఉన్నాయని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కేసులో నిజనిజాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అసలు ఏమి జరిగిందంటే..: భూపాలపల్లికి చెందిన పబ్బోజు రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేట్​ ఇంజినీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె పదోతరగతి చదువుతున్నప్పుడు పరిచయమైనా రాహుల్​ గతంలో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేశాడు. ఈ విషయాన్ని రక్షిత కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. రాహుల్‌కు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా అతడిలో ఏ మాత్రం మార్పు రాలేదు. ఇటీవల రాహుల్ వేధింపులు ఇంకా శ్రుతి మించడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఆందోళన చేస్తున్న స్థానికులు: మొదటిసారే నిందితులపై వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి వదిలేశారని స్థానికులు అంటున్నారు. ఆ సమయంలోనే కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇలా వచ్చేది కాదని వాపోయారు. కఠిన చర్యలు తీసుకోలేనందునే రక్షిత ప్రాణాలు పోయాయని విచారిస్తున్నారు.

రక్షిత ఆత్మహత్య కేసులో ఇన్‌స్పెక్టర్‌ మల్లేశంతో ముఖాముఖి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.