ETV Bharat / state

'ఏం బాబూ.. జీతాలు సమయానికి అందుతున్నాయా?'

author img

By

Published : Feb 26, 2020, 7:58 PM IST

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ జనగామ జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. సమస్యలపై స్థానికులతో మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన మంత్రి సమయానికి జీతాలు వస్తున్నాయో లేదోనని ఆరా తీశారు.

Minister Ktr asks municipal employees about their salaries
'ఏం బాబు.. జీతాలు సమయానికి అందుతున్నాయా'

'ఏం బాబు.. జీతాలు సమయానికి అందుతున్నాయా'

జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని జరుగుతున్న కార్యక్రమాలను ఏ విధంగా జరుగుతున్నాయో కాలనీల్లో తిరుగుతూ ఇంటిఇంటికి వెళ్లి మహిళలతో, వృద్ధులతో ముచ్చటించారు. సరైన సమయానికి చెత్తను తీసుకొని వెళ్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు.

పారిశుధ్య కార్మికులను కలిసి వారితో మాట్లాడి.. జీతాలు సరిగ్గా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. బూట్లు, చేతులకు గ్లోవ్స్​ వేసుకుని పనిచేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.

ఇవీ చూడండి: దానం చేస్తే 25లక్షలు అన్నారు.. అందినకాడికి దోచేశారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.