ETV Bharat / state

నాచారం డివిజన్​లో టికెట్ లొల్లి.. తెరాస ఆశావహుల ఆగ్రహం

author img

By

Published : Nov 19, 2020, 9:42 AM IST

జీహెచ్​ఎంసీలో టికెట్ల లొల్లి మొదలయింది. నాచారం డివిజన్​ తెరాస టికెట్ కాంగ్రెస్ నుంచి వచ్చిన సిట్టింగ్ కార్పొరేటర్​కు ఇవ్వడంపై తెరాస అధ్యక్షుడు మేడల మల్లికార్జున్ జ్యోతి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆశచూపి తమను మోసం చేశారని ఆరోపించారు.

ticket issue in nacharam division
నాచారం డివిజన్​లో టికెట్ లొల్లి

గ్రేటర్​లో టికెట్ల గొడవ మొదలైంది. నాచారం డివిజన్ టికెన్​ను కాంగ్రెస్​ నుంచి వచ్చిన సిట్టింగ్ కార్పొరేటర్​కు ఇవ్వడంపై తెరాస అధ్యక్షుడు మేడల మల్లికార్జున్-జ్యోతిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి తమకు టికెట్ ఆశ చూపి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

సిట్టింగ్​కే టికెట్ ఇవ్వడంపై కన్నీరుమున్నీరయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు మల్లికార్జున్-జ్యోతి దంపతులు స్పష్టం చేశారు. నాచారం డివిజన్​లో తెరాస కార్యకర్తలు తమ పార్టీ బ్యానర్లను చింపివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.