ETV Bharat / state

ఇవాళ 45 వేల మంది వలస కార్మికుల తరలింపు...

author img

By

Published : May 23, 2020, 8:19 PM IST

Updated : May 23, 2020, 10:19 PM IST

వలసకూలీల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరింది. ఈ ప్రత్యేక రైలును సీఎస్​ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

The 45,000 migrant workers at once from telangana to other states
రాష్ట్రం నుంచి ఒకేసారి 45 వేలకుపైగా కార్మికులు తరలింపు

సొంత రాష్ట్రాలకు వెళ్లే వలస కూలీలకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి.. సురక్షితంగా వాళ్లను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. వలస కూలీలతో ఒడిశా వెళ్తున్న రైలును డీజీపీ మహేందర్ రెడ్డితో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

"ఇప్పటికే 88 రైళ్ల ద్వారా 1.22 లక్షల వలస కూలీలను తరలించాం. ఇవాళ 40 రైళ్ల ద్వారా 45 వేలకుపైగా మందిని తరలిస్తున్నాం. రైల్వేశాఖ ద్వారా ఆహారం ఇస్తున్నారు. ప్రభుత్వం తరఫున కూడా ఆహారం, నీళ్లు అందిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో వలస కూలీలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నాం. సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న వారిని దాదాపు తరలించాం. సొంత రాష్ట్రాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేందుకు ఆసక్తి చూపడం శుభపరిణామం. మొత్తం 128 రైళ్ల ద్వారా సుమారు లక్షా 70వేల మంది కూలీలను తరలించాం."

-సోమేశ్‌ కుమార్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రాష్ట్రం నుంచి ఒకేసారి 45 వేలకుపైగా కార్మికులు తరలింపు

ఇదీ చూడండి : రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల షెడ్యూలు విడుదల

Last Updated : May 23, 2020, 10:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.