ETV Bharat / state

Telangana assembly elections result 2023 : రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవా కొనసాగినా నగరంలో మాత్రం కారు జోరే

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2023, 10:38 PM IST

Telangana assembly elections result 2023 : జిల్లాల్లో హవా కొనసాగించిన కాంగ్రెస్‌. జంటనగరాల పరిధిలో మాత్రం డీలాపడింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ భారీగా చీల్చటంతో ఆ ప్రభావం హస్తం పార్టీపై పడింది. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల అభివృద్ది, సుస్థిరమైన ప్రభుత్వం లేకపోతే నష్టపోతామని పలువురు వ్యాపారులు, వివిధ రంగాల వృత్తి నిపుణులు భావించారు. దీని వల్లే కాంగ్రెస్‌ దూకుడు కొనసాగలేదు. శాంతిభద్రత పరిరక్షణ సహా మెరుగైన సేవలు అందించడంతో ఆధికార బీఆర్​ఎస్​కి ఓటర్లు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలను బీఆర్​ఎస్​ దాదాపుగా నిలబెట్టుకుంది.

Telangana assembly results Live 2023
Telangana Assembly Election Majority in Hyderabad
Telangana assembly elections result 2023 : రాష్టవ్యాప్తంగా హస్తం హవా కొనసాగినా నగరంలో మాత్రం కారుజోరే

Telangana assembly elections result 2023 :రాష్ట్రవ్యాప్తంగా హస్తం హవా కొనసాగినా హైదరాబాద్‌లో మాత్రం కారుజోరు కొనసాగింది. జీహెచ్​ఎంసీ పరిధిలో బీఆర్​ఎస్​ మరోసారి పట్టు నిలుపుకుంది. మైనార్టీలు అధికంగా ఉండటం సహా బీజేపీ, జనసేన పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడంతో కాంగ్రెస్‌ పెద్దసంఖ్యలో ఓట్లను సాధించలేదు. ఈ అంశం బీఆర్​ఎస్​కు కలిసివచ్చింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో గులాబీపార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చినా మరికొన్నిచోట్ల ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

నగరంలోని సెటిలర్స్ సహా పలువురు పెట్టుబడిదారులు బీఆర్​ఎస్​ వైపు మొగ్గుచూపడం ఆ పార్టీకి కలిసివచ్చింది. ఇతర రాష్ట్రవాసుల సంక్షేమానికి పలు భవనాలు నిర్మించడం వారందరికీ అండగా ఉంటామంటూ హామీ ఇవ్వడం గులాబీ పార్టీకి కలిసివచ్చింది. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడంతో వేరేప్రభుత్వం వస్తే ఇబ్బంది తప్పదన్న అంచనాలతో నగరంలో బీఆర్​ఎస్​కు పట్టం కట్టేందుకు సహకరించినట్లు పలువురు భావిస్తున్నారు.

Telangana Assembly Elections Result Live 2023 : హైదరాబాద్ చేరుకుంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, గచ్చిబౌలి హోటల్​లో మకాం

Telangana Assembly Election Majority in Hyderabad : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని (Andrapradesh Capital) విషయంలో జగన్ సర్కార్ మాటమార్చుతూ ఉండడంతో ఆ రాష్ట్రానికి చెందిన చాలామంది హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టారు. అలాంటి వారంతా హైదరాబాద్‌లోని వ్యాపార అవకాశాలు, ఇతర అంశాలు చూసి బీఆర్​ఎస్​ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ నుంచి చాలా కంపెనీలు వచ్చి తెలంగాణలో పెట్టుబడులుపెట్టాయి.

పదేళ్లలో గ్రేటర్‌వ్యాప్తంగా ఎస్​ఆర్​డీపీ ఆధ్వర్యంలో కొత్త పైవంతెనలు, అండర్‌పాస్‌లు నిర్మించారు. నగరం నలుమూలల అభివృద్ధి విస్తరణ జరగడంతో ఏపీ నుంచి వచ్చిన పెట్టుబడిదారులు బీఆర్​ఎస్​వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి సుమారు 60 వేలకుపైగా ఇళ్లను పేదలకు అందించారు. మరోసారి అధికారంలోకి వస్తే మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఇచ్చిన హామీ జంటనగరాల పరిధిలో గులాబీపార్టీ ఎక్కువగా సీట్లు దక్కించుకునేందుకు సహకరించింది.

Bandi Sanjay Demanding Recounting In Karimnagar : కరీంనగర్​ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

జంటనగరాల్లో గత సంస్కృతికి భిన్నంగా శాంతిభద్రతలను కాపాడటంలో బీఆర్​ఎస్​ సర్కారు (BRS Government) ప్రత్యేక శ్రద్ద వహించడం బాగా కలిసివచ్చింది. అన్ని ప్రాంతాలవారు సురక్షితంగా ఉండటంతోపాటు నిరంతర విద్యుత్‌, తాగునీరు, ప్రజారవాణా విస్తరణ వంటి అంశాలు బీఆర్​ఎస్​కు ప్రజలను దగ్గర చేశాయి. పచ్చదనం పెంచటంతోపాటు జీహెచ్​ఎంసీ పరిధిలో మెరుగైన సేవలు అందించడం ఓటర్లను ఆకట్టుకుంది.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్​ఎస్​, కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు జోరుగా ప్రచారాలు కొనసాగించాయి. కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ (Rahul Gandhi) ప్రారంభించిన జోడో యాత్ర ప్రభావం హైదరాబాద్​లో చూపకపోయినా మిగితా ప్రాంతాలపై పడింది. నగరం అభివృద్ధిగా ఉండడంతో పట్టణ వాసులంతా గులాబీ పార్టీ వైపే మొగ్గు చూపారు. కానీ ఇతర ప్రాంతాలు కాంగ్రెస్​కు మొగ్గు చూపాయి.

DK Sivakumar meet Revanth, Telangana assembly election Results 2023 : రేవంత్ రెడ్డితో డీకే శివకుమార్ సంబురాలు

కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా- ఎన్నికల విజయంపై రేవంత్ ట్వీట్

Rangareddy District, Telangana Assembly Elections Result 2023 Live : మెజార్టీకి అడ్డాగా మారిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.