ETV Bharat / state

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 10:17 AM IST

Prajavani Program in Telangana : అర్ధరాత్రి, తీవ్రమైన చలి, వందల కిలోమీటర్ల దూరం ఇవేవీ వారికి అడ్డంకి కావట్లేదు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజా భవన్ ఎదుట వేకువజాము నుంచే వరుసలో నిలుచుంటున్నారు. ప్రజావాణికి వస్తున్న అర్జీదారులు తమ సమస్య పరిష్కారం అయితే చాలు తమకు ఇవ్వన్నీ కష్టాలుగా అనిపించవు అని అంటున్నారు.

Prajavani Programme
Congress Government Prajavani Programme

ఉదయం నంచే క్యూలైన్​లో నిల్చున్న ప్రజలు - ప్రజావాణిలో తమ గోడు వెల్లబోసుకునేందుకు వచ్చిన జనం

Prajavani Program in Telangana : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజా సమస్యలు వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. ఉదయం 10 గంటల లోపు చేరుకున్న వారే అర్జీ చేసుకునేందుకు అర్హులు అని ప్రభుత్వం తేల్చి చెప్పడంతో ఎలాగైనా 10 గంటల లోపు క్యూ లో నిల్చునేందుకు అర్ధరాత్రి బయలుదేరి వస్తున్నారు. ఆనారోగ్య పీడితులు, భూ సమస్యలతో ఇబ్బంది పదుతున్నవారు తమ సమస్యను ముఖ్యమంత్రికి విన్నవించుకుంటేనే పరిష్కారం అవుతాయని, అందుకే వచ్చామని అంటున్నారు.

నేను హైదరాబాద్​ నుంచి వచ్చాను. 2019 లో సాహితీ కన్​స్ట్రక్షన్​​కు డబ్బులు కట్టాను. బాధితులు చాలా మంది ఉన్నాము. ఆ కంపెనీ యజమాని డబ్బు తీసుకొని పరారయ్యాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాం. రెరాలో ఫిర్యాదు చేశాం. గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కాంగ్రెస్​ పార్టీ ప్రవేశ పెట్టిన ఈ కార్యక్రమం ద్వారా మా సమస్యలు పరిష్కారం అవుతుందని ఇక్కడికి వచ్చాం." - బాధితుడు

ప్రజావాణికి భారీ స్పందన- ప్రజాభవన్​కు బారులు తీరిన ప్రజలు

జిల్లాల నుంచి ప్రజల రాక : నగరవాసులే కాకుండా పలు జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రజావాణి కి వస్తున్నారు. వచ్చిన వారిని సరైనా విధంగా లోనికి పంపెలా పోలీసులు కృషి చేస్తున్నారు. దివ్యంగులకు ప్రత్యేకంగా రద్దీ లేని దారి నుంచి లోనికి పంపిస్తున్నారు. అయితే వచ్చినవారికి మౌలిక సదుపాయాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవాలని అర్జీదారులు కోరుతున్నారు. జిల్లాల నుంచి వచ్చే వారికి ఎక్కడ ఉండాలో తెలియక రోడ్ పైనే పడుకుంటున్నామని ఈ సమస్యను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

"సంవత్సరం నుంచి కిడ్ని సమస్యతో బాధ పడుతున్నాను. దీనికి సంబంధించిన ఇంజెక్షన్​ ఖర్చుతో కూడుకుంది. మందులు, టెస్ట్​లకు చాలా ఖర్చు అవుతోంది. ప్రజావాణి ద్వారా వైద్య పరంగా ఖర్చు కోసం కాస్త సాయం లభిస్తుందని ఇక్కడికి వచ్చాను.అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి క్యూలో నిలబడ్డాను. ఆరోగ్య శ్రీ కార్డు కిడ్నీ ఇంజెక్షన్​కు వర్తించదని చెబుతున్నారు." -మనుగురి నాగన్న, ఖమ్మం జిల్లా

కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి సమావేశం - ప్రజాపాలన, ఆరు గ్యారంటీల అమలుపై చర్చ

సమస్యల పరిష్కారం కోసం : వేకువజాము నుంచి క్యూ లైన్ లో నిలబడి తమ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న సమస్యలు ఇప్పుడైనా పరిష్కారం అవుతాయని ఉద్దేశంతో చలిని సైతం లెక్క చేయకుండా బాధితులు వస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవాడానికి బారులు తీరారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం, శుక్రవారం మాత్రమే స్వీకరిస్తుండటంతో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజా భవన్​కు తరలివచ్చారు.

ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం

ప్రజావాణి కార్యక్రమానికి భారీ స్పందన - అర కిలోమీటర్ వరకు బారులు తీరిన అర్జీదారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.