ETV Bharat / state

Officers Transfers in Telangana : రాష్ట్రంలో మరో ఇద్దరు అధికారులపై ఈసీ బదిలీ వేటు

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 27, 2023, 7:53 PM IST

Updated : Oct 27, 2023, 9:26 PM IST

Officers Transfers in Telangana : రాష్ట్రంలో మరో ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ బి.గోపి, పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడు బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Officers Transfers in Telangana
Officers Transfers

Officers Transfers in Telangana : రాష్ట్రంలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) బదిలీ వేటు వేసింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ బీ.గోపి, పోలీస్ కమిషనర్ ఎల్.సుబ్బారాయుడు బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

Election Commission Transfer Officers in Telangana : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇద్దరు అధికారులకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(Shanthi Kumari) ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే కింది అధికారులకు బాధ్యతలు అప్పగించాలని.. అదేవిధంగా సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని ఐఏఎస్ అధికారి గోపి, ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడును సీఎస్ ఆదేశించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇరువురు అధికారులను ఈసీ బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

EC Transfers Several Collectors and SPs in Telangana : హైదరాబాద్ సీపీ సహా పలువురు కలెక్టర్లు, ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశం

EC Transfers Several Collectors and SPs in Telangana : ఇటీవల అక్టోబర్ 11న రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్లు, పోలిస్ కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. హైదరాబాద్​లో సమీక్ష అనంతరం.. అధికారుల పనితీరు, వారిపై వచ్చిన ఫిర్యాదులు, గత అనుభవాలు, తదితరాలను దృష్టిలో పెట్టుకొని ఈసీ అధికారులను బదిలీ చేసింది. డబ్బు, మద్యం, ఇతరత్రాల పంపిణీ, మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా వచ్చిన ఫిర్యాదులు సహా ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి కలెక్టర్‌ హరీశ్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌, యాదాద్రి కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, నిర్మల్‌ కలెక్టర్‌ వరుణ్‌ రెడ్డిలపై ఈసీ బదిలీకి ఆదేశించింది. అలాగే హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌, వరంగల్‌ సీపీ రంగనాథ్‌, నిజామాబాద్‌ సీపీ వి.సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి, ఎక్సైజ్‌ శాఖ సంచాలకుడు ముషారఫ్‌ అలీతో పాటు 9 జిల్లాల నాన్‌కేడర్‌ ఎస్పీల బదిలీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

EC Focus on Telangana Assembly Elections 2023 : అదేవిధంగా అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉన్న ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖలకు విడిగా ముఖ్య కార్యదర్శులను నియమించాలని ఈసీ ఆదేశించింది. బదిలీ అయిన అధికారులు వెంటనే తమ కింది వారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి రిలీవ్ కావాలని స్పష్టం చేసింది. ఆయా స్థానాల్లో కొత్త అధికారుల నియామకం కోసం ప్యానల్ పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

EC Transfers Several Collectors and SPs In Telangana : 20 మంది అధికారులపై ఈసీ వేటు.. ఎన్నికల విధుల నుంచి వారంతా ఔట్

Election Commission Officials Visit To Telangana : ఎన్నికల వ్యయం పెంచండి.. ఈసీకి రాజకీయ పార్టీల విజ్ఞప్తి

Last Updated : Oct 27, 2023, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.