ETV Bharat / state

Gutta sukender reddy: ఆ సమయంలో అవి తప్పకుండా చూసేవాడిని: గుత్తా

author img

By

Published : Mar 23, 2022, 4:57 AM IST

కొవిడ్ సమయంలో ఈటీవీలో వచ్చే కొన్ని కార్యక్రమాలకు అంకితమయ్యాయని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా స్వరాభిషేకం, పాడుతా తీయగా, అలీతో సరదాగా కార్యక్రమాలు తప్పనిసరిగా చూసేవాడినని పేర్కొన్నారు. వంశీ ఆర్ట్ థియేటర్స్-శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Gutta sukender reddy
శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

కరోనా సమయంలో ఈటీవీలో వచ్చే స్వరాభిషేకం, పాడుతా తీయగా, అలీతో సరదాగా కార్యక్రమాలు తప్పనిసరిగా చూసేవాడినని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి పాటకు షష్టిపూర్తి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హైదరాబాద్​లో రవీంద్రభారతిలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. వంశీ ఆర్ట్ థియేటర్స్-శుభోదయం గ్రూప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.

సినారెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నా గుత్తా... తన సాహిత్యం, గేయ రచనలు తెలుగు వారిని ఎంతో ఆకర్షించాయని తెలిపారు. ఏ పోరాటానికి, స్వాతంత్య్ర పోరాటాలు పాటల నుంచే ఉద్భవిస్థాయిని అలాగే మనస్సును ఉత్తేజపరుస్తాయన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించానని... అదే అనుభవం వల్లే మళ్లీ రెండో సారి మండలి ఛైర్మన్​గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎదిగి వస్తారని కొంతమంది ఎగిరెగిరి వస్తారని అన్నారు. కిందిస్థాయి నుంచే వచ్చేవారు స్థిరస్థాయీగా ఉంటారని... దీనికి ఉదాహరణ సి. నారాయణ రెడ్డి అని గుత్తా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు శుభోదయం ఛైర్మన్ శ్రీలక్షి ప్రసాద్ కలపటపులను, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు శైలజ వంశీ రాజులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు గాయనీ గాయకులు సినారే రచించిన పాటలను పాడి ఆహూతులను అలరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కేవీ రమణాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , సినీ సంగీత దర్శకుడు మాధవసిద్ధి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ ఖరారు.. ప్రకటించిన విద్యాశాఖ

Yadadri Temple News: యాదాద్రిలో ఘనంగా పంచకుండాత్మక మహాయాగం

Attack: కత్తులతో దాడులు చేసుకున్న రెండు వర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.