ETV Bharat / state

ఊరెళ్లిపోతావా మావా.. ఊరెళ్లిపోతావా.. అయితే పోలీసులకు చెప్పి నువ్వు బయలెల్లిపో మావా..!

author img

By

Published : Jan 12, 2023, 8:09 AM IST

Updated : Jan 12, 2023, 8:26 AM IST

Thefts in Sankranti Holidays : సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణ మొత్తం ఊరెళ్లిపోతుంది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో అధికశాతం ఊళ్లకు వెళ్తారు. ఇలా వెళ్లేటప్పుడు ఇళ్లకు తాళాలు వేసి.. ఎవరు రారు కదా అని పోలీసులకు చెప్పకుండా వెళ్తూ ఉంటారు. ఈ పండగ సమయంలోనే అధిక శాతం దొంగతనాలు ఇళ్లల్లో జరుగుతున్నాయి. ఈ విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. "మీరు హ్యాపీగా ఊరెళ్లి పండుగ ఎంజాయ్ చేయండి.. మీ ఇళ్లకు మేం కాపలాగా ఉంటాను." మీ ఇంటికి మేము భద్రతగా ఉంటాము అంటున్నారు. ఇంకేందుకు మరి మీరు ఈరోజు వెళ్లండి మీ వివరాలు ఇవ్వడానికి..

camp
ఊరు

Thefts in Sankranti Holidays : సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 17 వరకు విద్యా సంస్థలకు సెలవులు. దీంతో జిల్లాలోని వికారాబాద్‌, తాండూర్‌, పరిగి, కొడంగల్‌ పట్టణాల్లోని అధికశాతం ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊళ్లకు వెళ్లడం సాధారణం. ఇదే అదనుగా దొంగలు చెలరేగిపోతారు. గతంలో జరిగిన పలు దొంగతనాలకు తాళాలు వేసి ఉన్న ఇళ్లే కేంద్రమయ్యాయి. కాబట్టి ఊళ్లకు వెళ్లే వారు ముందస్తు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా పోలీసు అధికారి ఎన్‌.కోటిరెడ్డి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు.

ఇలా చేయండి..

  • ఊళ్లకు వెళ్లే వారు తలుపులకు తాళాలు కనిపించేలా వేయకూడదు. అడ్డుగా తెర వేయాలి. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను, నగదు ఇళ్లల్లో ఉంచుకోకూడదు.
  • పక్కింటివారికి చెప్పి వెళ్లడం, గదిలో, వరండాలో లైటు వెలిగేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వచ్చి రోజూ చూసి వెళ్లేలా, పగటిపూట లైట్లు ఆర్పి, చీకటి పడగానే మళ్లీ వేసేలా ఏర్పాటు చేసుకోవాలి.
  • దినపత్రిక వేసుకునే అలవాటు ఉన్నవారు వాటిని అలాగే ఉంచితే ఇంట్లో ఎవరూ ఉండటం లేదన్న విషయం తెలిసిపోతుంది. అందుకే రోజు దినపత్రికలను తీసి ఉంచమని పక్కింటివారికి చెప్పాలి.

గస్తీ పెంచుతాం: పండుగకు ఇంటికి తాళం వేసి ఊరెళ్లేవారు తప్పనిసరిగా వీలు చేసుకొని తమ పరిధిలోని పోలీస్‌ఠాణాలో వివరాలు అందజేయాలని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇందుకోసం అన్ని ఠాణాల్లో ప్రత్యేకంగా ఓ రాత పుస్తకం ఉంచామన్నారు. ఒకవేళ ఈ అవకాశం లేకుంటే తమ ఇంటి చిరునామాలను ఆయా నిలయాధికారుల చరవాణి సంఖ్యలకు ఎస్‌ఎంఎస్‌, స్థిరవాణి సంఖ్యలకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించారు. వారి ఇళ్లపై ప్రత్యేక నిఘా వేసి రాత్రిపూట గస్తీని పెంచుతామని వివరించారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 12, 2023, 8:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.