ETV Bharat / state

Hyderabad Sub Inspector Drugs Case Update : ఖాకీ వనంలో డ్రగ్స్.. ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్​

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 11:53 AM IST

Updated : Aug 29, 2023, 1:43 PM IST

Hyderabad Sub Inspector Drugs Case Update : మత్తుపదార్థాలు విక్రయించేందుకు సిద్ధమైన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఎస్సై రాజేంద్ర అరెస్ట్‌ పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది. నైజీరియన్ల నుంచి స్వాధీనం చేసుకున్న సరుకును న్యాయస్థానం ఎదుట ఉంచకపోవటాన్ని ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై స్పెషల్‌ బ్రాంచ్‌ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సైబరాబాద్‌లో అరెస్టయిన డ్రగ్‌ విక్రేత నివాసంలో ఖరీదైన వాచీ, రూ.10 లక్షల నగదు సొంత ఖాతాలో జమచేసుకున్న ఒక ఇన్‌స్పెక్టర్‌ బాగోతం బయటపడినట్టు తెలుస్తోంది.

Hyderabad Sub Inspector Drugs Case Update
Hyderabad Sub Inspector

Hyderabad Sub Inspector Drugs Case Update ఖాకీ వనంలో డ్రగ్స్ ఆ ముగ్గురిపై కూడా పోలీసుల ఫోకస్​

Hyderabad Sub Inspector Drugs Case Update : నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలతో ఏకంగా సైబర్‌ క్రైమ్ ఎస్సై పట్టుబడటం.. పోలీసుల వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ.. డ్రగ్స్‌, గంజాయి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తే.. ఖాకీలే ఇలాంటి పనులు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు ఇంకా ఎన్ని, ఎప్పట్నుంచి జరుగుతున్నాయి..? ఇంత ధైర్యంగా ఎలా చేయగలుగుతున్నారు? వెనకాల అధికారుల సాయముందా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Hyderabad Sub Inspector Arrested for Drugs Supply : ఇక.. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్ ఎస్సై రాజేంద్ర విషయానికొస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగ్గురు కానిస్టేబుళ్లు సహా ఎస్సై.. మహారాష్ట్రలోని కందేశ్వర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సైబర్‌ నిందితుడిని పట్టుకునేందుకు స్థానిక పోలీసులతో కలిసి వెళ్లారు. అక్కడ గదిలో ఉన్న నైజీరియన్‌ను అదుపులోకి తీసుకునేందుకు ఎస్సై రాజేంద్ర(SI Rajendra Arrest) లోపలకు వెళ్లారు. ముగ్గురు కానిస్టేబుళ్లు గది బయటే ఉండిపోయారు.

Telangana SI Arrested for Selling Drugs : గదిలో ఉన్న ఇద్దరు నైజీరియన్ల వద్ద సుమారు 5 కిలోల మాదకద్రవ్యాలు లభించాయి. నిందితుల్లో ఒకరు తప్పించుకున్నాడు. మరొకరిని అదుపులోకి తీసుకుని స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టు అనుమతితో నగరానికి తీసుకొచ్చి రిమాండ్‌కు తరలించారు. గదిలో దొరికిన మాదకద్రవ్యాల్లో 1,750 గ్రాముల మెథకొలిన్‌ను రాజేంద్ర తన వద్దనే దాచుకున్నాడు. మణికొండ శ్రీనివాస్‌కాలనీలోని తన నివాసంలో భద్రపరిచాడు.

6 నెలలుగా డ్రగ్స్‌ సరఫరా చేసే ఏజెంట్లు, దళారులతో మెథకొలిన్‌ విక్రయించేందుకు మంతనాలు జరిపాడు. ఇటీవల టీఎస్ ​న్యాబ్‌కు పట్టుబడిన డ్రగ్‌ పెడ్లర్‌ వద్ద లభించిన సెల్‌ఫోన్‌తో గుట్టు బయటపడింది. వాట్సాప్‌ ఛాటింగ్‌లో పెద్దఎత్తున మాల్‌ ఉందనే విషయాన్ని టీఎస్ న్యాబ్‌ అధికారులు నిర్ధారించుకున్నారు. డెకాయ్‌ ఆపరేషన్‌తో డ్రగ్‌ పెడ్లర్‌ మాదిరిగా ఛాటింగ్‌ చేసి.. రాజేంద్రను సరుకుసహా బయటకు రప్పించి అరెస్ట్‌ చేసి.. డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రను అదుపులోకి తీసుకునేంత వరకూ డ్రగ్స్‌ విక్రయానికి సిద్ధమైన వ్యక్తి.. పోలీస్‌ అధికారి అనే విషయం గుర్తించలేకపోవటం పోలీసులనే ఆశ్చర్యానికి గురిచేసింది.

Telangana SI Arrested for Selling Drugs : కటకటాల్లోకి ఖాకీ అధికారి.. డ్రగ్స్ విక్రయిస్తూ ఎస్సై అరెస్ట్

ఆ ముగ్గురి కానిస్టేబుళ్లపై పోలీసుల దృష్టి : నైజీరియన్లు పట్టుబడిన 5 కిలోల మెథకొలిన్‌(Methacholine)లో కొంతభాగం అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాన్ని అక్కడి న్యాయస్థానంలో దాఖలు చేశారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎస్సైతో కలిసి మహారాష్ట్ర వెళ్లిన ముగ్గురు కానిస్టేబుళ్లకు డ్రగ్స్‌తో ఉన్న సంబంధాలపై వివరాలు సేకరించమని టీఎస్ న్యాబ్‌ అధికారులు.. రాయదుర్గం పోలీసులకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురి కానిస్టేబుళ్లపై పోలీసు అధికారులు దృష్టిసారించారు. 6 నెలల వ్యవధిలో వారు సాగించిన ఫోన్‌కాల్స్, వాట్సాప్‌ ఛాటింగ్స్‌(WhatsApp chats)ను విశ్లేషిస్తున్నట్టు సమాచారం.

Telangana Sub Inspector Arrested for Selling Drugs : సమాజంపై తీవ్ర ప్రభావం చూపే మాదకద్రవ్యాల కట్టడికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. కఠినంగా వ్యవహరిస్తున్నా మహానగరంలో కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు మత్తు ముఠాలకు సహకరించటం ఆందోళన కలిగిస్తోంది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌లో కొంత భాగమే బహిర్గతం చేస్తున్నట్లు.. మరికొంత భాగాన్ని ఏజెంట్ల ద్వారా విక్రయించి వాటాలు పుచ్చుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి.

గతేడాది నగరానికి చెందిన ఒక ఇన్‌స్పెక్టర్‌ ధూల్‌పేట్‌లోని గంజాయి ముఠాల నుంచి ప్రతి నెలా రెండున్నర లక్షల కమీషన్‌ తీసుకునేవాడంటూ స్వయంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు పోలీసు అధికారులకు నివేదిక అందజేశారు. నగర టాస్క్‌ఫోర్స్‌లో ఒక హెడ్‌కానిస్టేబుల్‌ గంజాయి ముఠాల నుంచి మామూళ్లు వసూలు(Head Constable Collects Money From Ganja Gangs) చేస్తున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. ఎస్సై రాజేంద్ర అరెస్ట్‌తో మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Cyber Crime SI Arrested in Drugs Case : డ్రగ్స్ పట్టివేతలో చేతివాటం.. సైబర్‌ క్రైమ్ ఎస్సై అరెస్ట్.. రిమాండ్​కు తరలింపు

spa centers Extortion Hyderabad : 'సీటు మారాడు.. రేటు పెంచేశాడు'

Last Updated : Aug 29, 2023, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.