ETV Bharat / state

Hyderabad Home Guard Suicide Update : జీతం రాలేదని ఆత్మహత్యకు పాల్పడిన హోంగార్డు.. పరిస్థితి విషమం

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2023, 2:57 PM IST

Hyderabad Home Guard Suicide Update : జీతం ఇంకా ఇవ్వలేదని హోంగార్డు మనస్తాపంతో శరీరంపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు పరిస్థితి విషమంగా ఉందని.. వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం డీఆర్​డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు.

Home Guard Suicide
Hyderabad Home Guard Suicide Update

Hyderabad Home Guard Suicide Update : మంగళవారం హైదరాబాద్​లోని గోషామహల్​లో పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి(Commit Suicide) పాల్పడిన హోంగార్డు రవీందర్​ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం డీఆర్​డీవో(DRDO) అపోలో ఆస్పత్రికి తరలించారు. శరీరం 67 శాతం కాలిన గాయాలతో ఉందని తెలిపారు. హోంగార్డులను చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో ఆత్మహత్యకు యత్నించానని రవీందర్​ ఆవేదన వ్యక్తం చేశారు.

జీతం కోసం అడగడానికి వెళితే ఏఎస్​ఐ నర్సింగరావు, కానిస్టేబుల్​ చందు అవమానించారని తెలిపారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన భర్త ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని.. హోంగార్డు కార్యాలయంలో ఏదో జరిగిందని రవీందర్‌ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. తమ భర్తకి మంచి వైద్యం అందించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవీందర్​ను పలువురు హోంగార్డులు వెళ్లి పరామర్శించారు.

Miyapur Gun Fire Incident Solved : ఉద్యోగం పోయిందనే కోపంతో.. ఉసురు తీశాడు

Hyderabad Home Guard Suicide News Today : ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డు రవీందర్​కు మద్దతుగా నిలవాలని హోంగార్డుల సంఘం నిర్ణయం తీసుకుంది. వారిని క్రమబద్ధీకరించాలంటూ కొంతకాలంగా హోంగార్డులు ఆందోళనలు చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని హోంగార్డుల సంఘం ఆవేదన చెందారు. వెంటనే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని డిమాండ్​ చేశారు. ప్రతి హోంగార్డుకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేయాలని సూచించారు. పదవీ విరమణ చేసిన వారికి రూ.10 లక్షలు ఇవ్వాలన్నారు. అలాగే హోంగార్డుల పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.

Hyderabad SI Rajendra Drugs Case Update : డ్రగ్స్ కేసు అప్డేట్.. SI రాజేంద్ర కాల్​డేటాలో అసలుగుట్టు

అసలేం జరిగింది : హైదరాబాద్​లోని పాతబస్తీకి చెందిన రవీందర్​(38) చాంద్రాయణగుట్ట ట్రాఫిక్​ ఠాణాలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు. తన అవసరాల కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాడు. బ్యాంకు రుణానికి సంబంధించిన ఈఎంఐ ప్రతి నెల 5వ తేదీన చెల్లించేలా ఆప్షన్​ పెట్టుకున్నారు. అందులో భాగంగా జీతం పడితే.. అందులో కట్​ చేసుకునేవారు. ఈ నెల జీతం ఇంకా పడకపోవడంతో.. గోషామహల్​లోని హోంగార్డు కమాండెంట్​ కార్యాలయానికి వెళ్లాడు.

Home Guard Tried to Commit Suicide : అక్కడి కార్యాలయం వారు చెక్కులు బ్యాంకులకు పంపించామని.. ఒకటి లేదా రెండు రోజుల్లో జీతం జమ అవుతాయని చెప్పారు. దీంతో మనస్తాపానికి గురైన హోంగార్డు.. కార్యాలయం నుంచి బయటకు వెళ్లి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నారు. దీంతో శరీరమంతా మంటలు వ్యాపించాయి. ఆ నొప్పికి భరించలేక గట్టిగా కేకలు వేస్తూ కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఈ క్రమంలో తెరుకున్న అక్కడి ఉన్న సిబ్బంది.. వెంటనే మంటలు ఆర్పి వేయశారు. అప్పటికే దాదాపు సగం శరీరానికి గాయాలు అయ్యాయి. వెంటనే అంబులెన్స్​లో ఏసీపీ వెంకట్​రెడ్డి, సీఐ రవీందర్​, ఎస్సై లక్ష్మయ్య ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Two Young Women Suicide : వాట్సాప్‌ డీపీ మార్ఫింగ్.. ఇన్‌స్టాలో ఫొటోలు వైరల్‌.. ఇద్దరు యువతుల సూసైడ్

Jagtial Deepthi Murder Case Update : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీప్తి మర్డర్​ కేసు.. పోలీసుల అదుపులో చందన..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.