ETV Bharat / state

జంటనగరాల్లో భారీ వర్షం.... వాహనాదారుల ఇక్కట్లు

author img

By

Published : Jun 18, 2020, 9:05 PM IST

జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్డన్నీ నీటితో నిండిపోయాయి. నగరవాసులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.

heavy rain in hyderabad and secunderabad twin cities
heavy-rain-in-hyderabad-and-secunderabad-twin-cities

హైదరాబాద్​ నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. ఈదురుగాలుతో కూడిన వర్షానికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. సికింద్రాబాద్, తిరుమలగిరి, ఆల్వాల్, బోయిన్‌పల్లి, జేబీఎస్, ఎల్బీనగర్, రామంతాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, మల్కాజిగిరి, నేరెడ్​మెట్, కుషాయిగూడ, చర్లపల్లి, దమ్మాయిగూడా, నాగారం, జవహర్​నగర్, ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, మారేడ్‌పల్లి, సుచిత్ర, కోంపల్లి, కుత్బుల్లాపూర్, చింతల్, షాపూర్‌నగర్‌లో భారీగా వర్షం పడింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. సరకుల కోసం కిరాణా దుకాణాలు, మొబైల్ స్టోర్స్​కు వెళ్లిన నగర వాసులు వర్షానికి తడిసిముద్దయ్యారు.

పాతబస్తీ, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్‌, లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, మెహదీపట్నం, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, గండిపేట్, అత్తాపూర్, కిస్మత్పూర్‌, బండ్లగూడ జాగీర్, మణికొండ, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, సైదాబాద్, చంపాపేట్, సంతోష్‌నగర్, మాదన్నపేట్‌, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, జహ్నుమ, కాలపత్తర్‌లో వర్షం నీరు రోడ్లపైకి రావడం వల్ల వాహనాదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఇదీ చూడండి: ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఆసిఫాబాద్ అగ్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.