ETV Bharat / state

'ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోశ్​ను ఎందుకు పిలిపించలేదు'

author img

By

Published : Dec 23, 2022, 10:09 PM IST

Kunamneni Fires on Bandi Sanjay : రాష్ట్ర ప్రభుత్వంపై ఛాలెంజ్ విసిరిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వ హామీలపై అదే స్టాండ్​తో ఉంటారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. విభజన హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు

కూనంనేని సాంబశివరావు
కూనంనేని సాంబశివరావు

kunamneni fires on bandi sanjay: రాష్ట్రానికి రావాల్సిన రూ. 35 వేల కోట్ల బకాయిలను కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. బండి సంజయ్ చెప్పుతో కొట్టుకుంటారా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోశ్​​ను ఎందుకు పిలిపించలేదని అడిగారు. భాజపా వాళ్లకు పేర్లు మారుస్తామనడం తప్ప.. మరో పని లేదని ఎద్దేవా చేశారు.

ముందు అమిత్​షా పేరు మార్చుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న క్రిస్టియన్లు, ముస్లింల అందరి పేర్లు మారుస్తారా అంటూ మండిపడ్డారు. చార్మినార్, రెడ్ ఫోర్ట్ లాంటి వాటిని కూలగొట్టేస్తారా, పేర్లు మార్చేందుకు మీరు ఎవరని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎవరికి మద్దతు ఇచ్చినా ప్రజల సమస్యలపై పోరాటం ఆగదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల డిమాండ్​తో లక్ష మందితో హైదరాబాద్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.