ETV Bharat / state

లక్ష ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంది: మంత్రి కేటీఆర్​

author img

By

Published : Oct 26, 2020, 10:48 PM IST

హైదరాబాద్​ నగరంలోని పలు ప్రాంతాల్లో చేపట్టిన లక్ష ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకుందని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఇళ్లను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు ఆయన వివరించారు.

Construction of 1 lakh houses is nearing completion: Minister KTR
లక్ష ఇళ్ల నిర్మాణం తుదిదశకు చేరుకుంది: మంత్రి కేటీఆర్​

హైదరాబాద్ నగరంలోని 111 ప్రాంతాల్లో రూ.9,714 కోట్ల వ్యయంతో చేపట్టిన లక్ష ఇళ్ల నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పేదలకు ఉచితంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం వినూత్నమైందని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఇళ్ల చిత్రాలను పంచుకున్నారు.

ఒక్కో ఇల్లు 560 చదరపు అడుగుల విస్తీర్ణంతో నగరంలో, నగరం చుట్టూ ఇళ్లను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రహదార్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, నీటి సరఫరా, కమ్యూనిటీ హాల్, వాణిజ్య సముదాయం లాంటి వసతులను సైతం అభివృద్ధి చేశామని.. పచ్చదనాన్ని పెంచేలా మొక్కలు నాటడంతో పాటు సుందరీకరణ పనులు కూడా చేపట్టినట్లు వివరించారు.

  • 🏙️The 2 BHK dignity houses are being constructed across all corners of the Hyd city including:

    👉 Chilkalguda Dhobighat and Old Maredpally

    👉 Indira Nagar

    👉 Ambedkar Nagar

    👉 Mailardevpally

    👉 Nizampet

    👉 Jammigadda pic.twitter.com/zJ9KkBfdm2

    — KTR (@KTRTRS) October 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి.. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.