ETV Bharat / state

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపై స్పెషల్ ఫోకస్​

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 7:56 AM IST

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనతో ప్రచారం ఊపందుకుంది. ప్రచారబరిలో దిగిన నాయకులు ఆరు గ్యారెంటీలు సహా అధికారంలోకి వస్తే చేయబోయే పనులను క్షేత్రస్థాయిలో వివరిస్తున్నారు. పేదలకు అండగా ఉండే పథకాలను అమలు చేస్తామని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగించి అధికారంలోకి రావటం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
Congress Election Campaign
Congress Election Campaign Started in Telangana

Congress Election Campaign Started in Telangana కాంగ్రెస్‌లో ప్రచార జోరు.. ఆరు గ్యారెంటీలపైనే పూర్తి ఫోకస్​

Congress Election Campaign in Telangana 2023 : కాంగ్రెస్‌ పార్టీ మొదట విడత అభ్యర్థుల జాబితా(T Congress MLA Candidate List)ను ప్రకటించిన తర్వాత.. ప్రచార సందడి మొదలైంది. అధికార బీఆర్​ఎస్​కు దీటుగా నేతలు.. జనంలోకి వెళ్లి ఆరు గ్యారెంటీలను వివరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో.. త్వరలోనే కాంగ్రెస్​ మేనిఫెస్టో(T Congress Manifesto)ను విడుదల చేయనుంది. ఈ మేరకు కాంగ్రెస్‌లో సీనియర్, జూనియర్ ఐనా పార్టీకి నష్టం చేకూరిస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెగేసి చెప్పారు. తనను తిడితే పట్టించుకోనన్న రేవంత్‌.. పార్టీపై విమర్శలుచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Telangana Congress Six Guarantees Campaign : టికెట్.. రాని వాళ్ళకి.. బాధ ఉంటుందన్న ఆయన తమ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తామని వివరించారు. బీఆర్​ఎస్​కు బీజేపీ, ఎంఐఏంలు బీటీమ్ లాంటివని ధ్వజమెత్తారు. సీక్వెల్ ఈక్వెల్‌గా ఉండాలని కొంతమంది యోధులను.. రెండో జాబితా కోసం ఆపినట్లు తెలిపారు. డిసెంబర్‌ 9న తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యం రోబోతుందని రేవంత్‌ ధీమా వ్యక్తం చేశారు.

"సోనియాగాంధీ సెప్టెంబరు 17న ఏదైతే ప్రకటన చేశారో..గ్యారెంటీల రూపంలో ఆ గ్యారెంటీలను అన్నింటినీ కూడా ప్రజలకు వివరించి. కాంగ్రెస్​ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తాం. సోనియాగాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారో.. అదే విధంగా డిసెంబరు 9 న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ఆరు గ్యారెంటీల మీద సంతకం పెట్టి.. 100 రోజుల్లో అమలు చేసే విధివిధానాలను పరిశీలించి.. విజయవంతం చేస్తాం. ​ కాంగ్రెస్​పై కేసీఆర్ చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు." - రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

Uppal MLA Ticket Issue in Congress Party : 'కాంగ్రెస్​ను ఖతం చేయడానికే రేవంత్​రెడ్డి పార్టీలోకి వచ్చారు'

Revanth Reddy Campaign in Mulugu : ములుగు నియోజకవర్గం గోవిందరావుపేట మండలం పస్రాలో.. ఆరు గ్యారెంటీల(Telangana Congress Six Guarantees)ను ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం చేశారు. రాబోయే వంద రోజుల్లో పేద, మధ్యతరగతి వర్గాలకు.. సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గడపగడపకు తిరుగుతూ.. ఓటర్లకు అవగాహన కల్పించారు. నాగార్జున సాగర్ ప్రజలు జై వీర్‌రెడ్డికి ఓటు వేస్తే తనకు వేసినట్లే భావిస్తానని.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి పేర్కొన్నారు. నిడమనూరులో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలను ఆహ్వానించారు.

నియోజవర్గ అభివృద్ధి జాతీయస్థాయిలో తెలిసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని జానారెడ్డి హితవు పలికారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి నకిరేకల్‌ టికెట్‌ దక్కించుకున్న వేముల వీరేశంను.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు

Congress Bus Yatra 2023 : రాష్ట్రంలో మూడు విడతలుగా కాంగ్రెస్ బస్సు యాత్ర.. 18న ప్రారంభం

Revanth Reddy Reacts on BRS Manifesto : 'కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలనే కేసీఆర్‌ కాపీ కొట్టారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.