ETV Bharat / state

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి

author img

By

Published : Feb 25, 2021, 4:31 PM IST

తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో అభ్యర్థులు నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషన్ తీరు ఏమాత్రం బాగాలేదని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్​.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి
నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ ముట్టడి

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని.. ఇదే వైఖరిని అవలంభిస్తే.. లక్షలాది మంది నిరుద్యోగులతో కమిషన్​ను ముట్టడిస్తామని బీసీ సంఘం జాతీయాధ్యక్షుడు ఆర్​ కృష్ణయ్య హెచ్చరించారు.

టీఎస్​పీఎస్సీ విడుదల చేసిన టీఆర్టీ-2017 నోటిఫికేషన్ హిందీ భాషా పండిట్​ తుది ఫలితాలను విడుదల చేయాలని.. తెలంగాణ నిరుద్యోగ ఐకాస ఆధ్వర్యంలో అభ్యర్థులు నాంపల్లిలోని టీఎస్​పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగ ఐకాస ఛైర్మన్ నీల వెంకటేష్ అధ్యక్షతన కృష్ణయ్య, అభ్యర్థులు కమిషన్​ కార్యాలయం గేటు ముందు బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల నియామకాల కోసం టీఆర్టీ-2017 పేరుతో టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందని కృష్ణయ్య తెలిపారు. ఈ నోటిఫికేషన్​లో అన్ని భాషల ఉపాధ్యాయుల ఫలితాలు విడుదల చేశారని... అభ్యర్థులు ఉద్యోగాల్లో కూడా చేరారని వివరించారు. కానీ హిందీ లాంగ్వేజ్ పండిట్​కు సంబంధించిన 342 పోస్టుల ఫలితాలను నాలుగేళ్లు గడుస్తున్నా.. నేటికీ ప్రకటించకపోవడం దారుణమన్నారు.

టీఎస్​పీఎస్సీ నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన అభ్యర్థులతో పోస్టులను భర్తీ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: రాష్ట్రానికి మరోసారి స్కోచ్‌ అవార్డులు.. ఉత్తమ మంత్రిగా కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.