ETV Bharat / state

RSP Fires on CM KCR : 'కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా..?'

author img

By

Published : May 11, 2023, 7:40 PM IST

RSP Fires on CM KCR : మోదీ, అమిత్‌ షాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతున్నారనేది పచ్చి అబద్ధమని.. వారి మధ్య బలమైన బంధం ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. అమిత్‌ షా ఆదేశాల మేరకు గుజరాత్‌కు చెందిన అమూల్ పాల కంపెనీని.. రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేటీఆర్‌ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. అమూల్‌తో రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ పట్టించుకోవట్లేదని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ క్రమంలోనే కిసాన్‌ సర్కార్‌ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా అని ప్రశ్నించారు.

RSP Fires on CM KCR
RSP Fires on CM KCR

RSP Fires on CM KCR : ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాడుతున్నారనేది పచ్చి అబద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆరోపించారు. వారి మధ్య బలమైన బంధం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అమిత్‌ షా కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖ మంత్రి కూడా అవుతారని ఎద్దేవా చేశారు. అమిత్‌ షా ఆదేశాల మేరకు గుజరాత్‌కు చెందిన అమూల్ అనే పాల కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేయడానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదం తెలిపారని, ఈ విషయం తలసాని వంటి మంత్రికి తెలియదని సెటైర్లతో తీవ్రంగా విమర్శించారు.

అమూల్‌ కంపెనీని కర్ణాటకలో ఏర్పాటు చేసి.. ఆ రాష్ట్రంలో ఉన్న నందిని అనే పాల కంపెనీని మూసివేయాలని చూస్తే అక్కడి ప్రజలు తిరగబడ్డారని ప్రవీణ్‌కుమార్‌ చెప్పారు. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లోని వర్గల్‌లో అమూల్ కంపెనీ ఏర్పాటు చేయడానికి ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించారని విమర్శించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర పాడి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా.. పట్టించుకోవడం లేదని ప్రకటనలో తీవ్రంగా తప్పుబట్టారు.

కిసాన్ సర్కార్ అంటే పాడి రైతుల పొట్ట కొట్టడమేనా..: తెలంగాణకు చెందిన విజయ డెయిరీకి ప్రభుత్వం గత రెండేళ్లుగా కనీసం ఎండీని కూడా ఎందుకు నియమించలేదని ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ నిలదీశారు. రావిర్యాల ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించడం లేదని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ రిలయన్స్ కంపెనీ లాభాల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీని చంపినట్లే.. తెలంగాణలో విజయ డెయిరీ వంటి స్థానిక కంపెనీలను చంపి అమూల్ కంపెనీని తెస్తున్నారని మండిపడ్డారు. కిసాన్ సర్కార్ అంటే రాష్ట్రంలో పాడి రైతుల పొట్ట కొట్టడమేనా అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ నినాదం రైతులను మోసం చేయడానికేనని దుయ్యబట్టారు.

ప్రజల ముందు కుస్తీ.. తెర వెనక దోస్తీ..: కేసీఆర్‌ కుమార్తె కవితను ఈడీ విచారణ నుంచి కాపాడడానికే కేసీఆర్‌ ఇదంతా చేస్తున్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల ముందు బీజేపీ, మోదీ, అమిత్‌ షాలకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని నాటకాలు ఆడుతూ.. తెరవెనక దోస్తీ చేస్తున్నారని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో ఒక యువతిపై ఎస్సై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో షీ టీమ్స్, మహిళా పోలీసులు ఎక్కడికి పోయారని, పోలీసులే ఇలా మహిళల పట్ల వివక్ష చూపితే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో పోలీసులు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆర్‌ఎస్పీ ఘాటుగా విమర్శించారు.

ఇవీ చూడండి..

BSP meeting in Hyderabad: 'రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పాగా'

'మౌనమే అంగీకారమా?.. విచారణ ఎందుకు ఇంత నత్తనడకన సాగుతోంది?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.