ETV Bharat / state

ఈరకమైన ఆన్‌లైన్‌ ఆటలు పిల్లలకు ఉపయోగం

author img

By

Published : Apr 21, 2019, 11:56 AM IST

Updated : Apr 21, 2019, 12:22 PM IST

విద్యార్థులు ఆన్​లైన్ గేమ్స్ ఆడితే...తల్లిదండ్రులకు చిర్రెత్తుకోస్తుంది. సమయం వృథా చేస్తున్నారని మహా కోపం. అదే మెుబైల్​, ఆన్​లైన్​లో ఆటల ఆడితే...విజ్ఞానం వస్తుందంటే...ఎందుకు కాదంటారు! విశాఖలో కొంతమంది యువత చేసిన ఆలోచన ఇదే.  వేటితో ఆరోగ్యం, సమయం వృథా అవుతుందని అనుకుంటున్నారో...వాటితో విజ్ఞానం పొందేలా ఆటలు రూపొందించారు.

ఆన్​లైన్​ ఆటలపై శ్రద్ధ చూపుతున్న పిల్లలు

ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో పిల్లలు చరవాణి ఆటలతో సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఇదే ప్రధాన అంశంగా తీసుకుని ఏ చరవాణి ఆటలు విద్యార్థులను హరిస్తున్నాయో అదే చరవాణి, అంతర్జాల ఆటల ద్వారా వారికి విద్యా విజ్ఞానం, వినోదం, పాఠాలు నేర్పే ప్రయత్నం చేశారు విశాఖకు చెందిన యువత. విస్​డమ్ వీల్ పేరిట ఓ ప్రాజెక్టు రూపొందించారు. పెద్ద వాల్తేరులో సాధన అకాడమీ పేరుతో గేమ్ హబ్ ప్రారంభించారు. చిన్న వయసు వారి నుంచి పీజీ విద్యార్థుల వరకు ఈ ఆటలు ఆడుకోవచ్చు.

విజ్ఞానం... వినోదం...!

అంతర్జాల ఆటలు మొదట ఆడే ముందు విద్యార్థి పేరు, తరగతి, తనకు నచ్చిన సబ్జెక్టు ఎంటర్ చేయాలి. అప్పుడు తెరపై ఆట వస్తుంది. ఆట జరుగుతూ ఉండగా ఎంచుకున్న అంశానికి తగిన ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నను తప్పులు లేకుండా చదవడమే ఆట ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. ఒక వేళ తప్పు చదివితే మెుదటికే మోసం... ఆట మెుదటి నుంచి ప్రారంభించాలి. విభిన్న రీతుల్లో ఆడటం వల్ల వారికి తెలియకుండానే అభ్యాసం పూర్తి అవుతుంది. చదవడంలో భాషపై పట్టు వస్తుంది. ఇలా ఆడటం వల్ల వినోదం. విజ్ఞానం వస్తుందని పిల్లలు సంబరపడుతున్నారు. పిల్లలకు ఆడే ముందు తర్ఫీదు ఇస్తున్నారు. రకరకాల ఆటలు ఇందులో సృష్టించి వారిలో ఆసక్తి పెంచుతున్నారు. అదే విధంగా ఆటలో ఇంటెలిజెంట్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఆటలో మెళుకువలు, జాగ్రత్తలు చెప్పేలా రూపొందించారు. ఇలా చేస్తే...వారంతట వారే ఆట మొదలు పెట్టడం..ముగించడంతో పిల్లల్లో ఆత్మస్థైర్యం పెరుగుతోంది. విస్​డమ్​ వీల్​లో ఆటలు ఆడటం వల్ల పిల్లలకు చదవడం, మాట్లాడం, సబ్జెక్టుపై అవగాహన వస్తోందని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒక్కప్పుడు చరవాణి ఆటలు వల్ల నష్టం జరుగుతోందని... బాధపడినా..ఇప్పుడు వారికి ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవి సెలవులు మరింత ఉత్సాహంగా ముగిస్తామంటున్నారు చిన్నారులు.

ఆన్​లైన్​ ఆటలపై శ్రద్ధ చూపుతున్న పిల్లలు

ఇవీ చూడండి: తెలంగాణలో కాంగ్రెస్ ఎదురీత

sample description
Last Updated : Apr 21, 2019, 12:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.