ETV Bharat / state

Municipal Commissioners Transfers : రాష్ట్రంలో భారీగా మున్సిపల్​ కమిషనర్ల బదిలీ

author img

By

Published : Jul 15, 2023, 10:24 PM IST

Massive Transfers In Telangana : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల దృష్ట్యా భారీగా బదిలీలు జరుగుతున్నాయి. మొన్న రెవెన్యూ శాఖలో, ఆ తర్వాత ఐపీఎస్​, నేడు మున్సిపల్​ కమిషనర్​లను వేర్వేరు చోట్లకు బదిలీ చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాలు సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 22 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Municipal Commissioners
Municipal Commissioners

Municipal Commissioners Transferred In Telangana : రాష్ట్రంలోని పురపాలక శాఖలో భారీగా మున్సిపల్​ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాలు సహా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 22 మంది అధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయం నుంచి బి.గీత రాధికను జీహెచ్ఎంసీకి ప్రభుత్వం బదిలీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో సంయుక్త సంచాలకులుగా టి.కృష్ణమోహన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

బడంగ్​ పేట మున్సిపల్​ కమిషనర్​గా బి. సుమన్​ రావును, రామగుండం కమిషనర్​గా సీహెచ్​. నాగేశ్వర్​ను ప్రభుత్వం బదిలీ చేసింది. మీట్​పేట కమిషనర్​గా ఏ.వాణి, ఖమ్మం కమిషనర్​గా బి.సత్యనారాయణరెడ్డిని, మిర్యాలగూడకు ఎంపీ పూర్ణచందర్​ రెడ్డిని బదిలీ చేశారు. నందికొండకు కే.వేణుగోపాల్​ను, పోచారం కమిషనర్​గా పీ.వేమన్​రెడ్డిని బదిలీ చేసి.. రామగుండం డిప్యూటీ కమిషనర్​గా ఆర్​.త్రయంబకేశ్వర్​ను నియమించింది. దమ్మాయిగూడ కమిషనర్​గా ఎస్​.రాజమల్లయ్యను బదిలీ చేశారు. ఇబ్రహీంపట్నం కమిషనర్​ మహ్మద్​ యూసఫ్​ను పదోన్నతిపై జీహెచ్​ఎంసీకి తరలించింది.

Municipal Commissioners Transferred : పాల్వంచ మున్సిపల్​ కమిషనర్​ సీహెచ్​ శ్రీకాంత్​కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ.. తుర్కయాంజల్​ కమిషనర్​గా నియమించింది. జీహెచ్​ఎంసీ డిప్యూటీ కమిషనర్​గా కే.నారాయణరావును బదిలీ చేయగా.. దమ్మాయిగూడ కమిషనర్​ ఏ స్వామికి ఉద్యోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్​గా బాధ్యతలు అప్పగించారు. జీ.రాజేంద్ర కుమార్​ నగరం కమిషనర్​గా, పోచారం అసిస్టెంట్​ కమిషనర్​ ఏ.సురేశ్​ను జీహెచ్​ఎంసీకీ, అలాగే ఎండీ సాబీర్​ అలీని ఘట్​కేసర్​ కమిషనర్​గా ప్రభుత్వం నియమించింది. మిర్యాలగూడ కమిషనర్‌ పీ రవీంద్ర సాగర్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేసింది. హుస్నాబాద్​కు ఆర్​.రాజశేఖర్​ను, ఏ.వెంకటేశ్​ను కొత్తపల్లి మున్సిపల్​ కమిషనర్​గా.. పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

22 మంది మున్సిపల్​ కమిషనర్ల బదిలీ లిస్ట్​ :

బడంగ్​ పేటబి. సుమన్​ రావు
మీర్​ పేటఏ. వాణి
రామగుండంసీహెచ్. నాగేశ్వర్
ఖమ్మంబి.సత్యనారాయణరెడ్డి
తుర్కయాంజల్ సీహెచ్. శ్రీకాంత్
జీహెచ్ఎంసీకె.నారాయణరావు
పాల్వంచఏ.స్వామి
ఇబ్రహీంపట్నంపి. రవీంద్ర సాగర్
నాగారంజి.రాజేంద్ర కుమార్
ఘట్ కేసర్ ఎండీ. సాబెర్ అలీ
మిర్యాలగూడఎం.పూర్ణచందర్
పెద్ద అంబర్ పేటఎస్. రవీందర్ రెడ్డి
నందికొండకె.వేణుమాధవ్
పోచారంపి.వేమన్ రెడ్డి
దమ్మాయిగూడఎస్.రాజమల్లయ్య
హుస్నాబాద్ఎం.ఆర్.రాజశేఖర్
కొత్తపల్లిఏ. వెంకటేశ్
రామగుండం డిప్యూటీ కమిషనర్​ఆర్.త్రయంబకేశ్వర్ రావు
జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ కమిషనర్ఏ.సురేష్
జీహెచ్ఎంసీమహమ్మద్ యూసుఫ్
సీడీఎంఏ సంయుక్త సంచాలకులుటి.కృష్ణమోహన్ రెడ్డి
జీహెచ్​ఎంసీబి.గీత రాధిక

IAS Officers Transfers And Posting In Telangana : శుక్రవారం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. పోస్టింగ్​ల కోసం ఎదురుచూస్తున్న పలువురు ఐఏఎస్​ల.. పోస్టింగ్​లను కూడా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 31 మంది ఐఏఎస్​లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు రెవెన్యూ శాఖలోనూ ప్రభుత్వం భారీగా బదిలీలు చేపట్టింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్​లకు స్థాన చలనం అయింది. మొత్తం 38 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.