ETV Bharat / state

ప్యాసింజర్​ రైళ్ల కోసం సికింద్రాబాద్​ క్లస్టర్​కు 10 దరఖాస్తులు

author img

By

Published : Oct 8, 2020, 1:03 PM IST

ప్యాసింజర్​ రైళ్ల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 12 క్లస్టర్ల కోసం 15 దరఖాస్తుదారుల నుంచి 120 దరఖాస్తులు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు రంగ పెట్టుబడులు వచ్చే అవకాశముందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.

10 applications to Secunderabad cluster for passenger trains
ప్యాసింజర్​ రైళ్ల కోసం సికింద్రాబాద్​ క్లస్టర్​కు 10 దరఖాస్తులు

ప్యాసింజర్​ రైళ్ల నిర్వహణ కోసం రిక్వెస్ట్​ ఫర్​ క్వాలిఫికేషన్(ఆర్ఎఫ్​క్యూ)లకు 15 దరఖాస్తుదారుల సంస్థల నుంచి 12 క్లస్టర్ల కోసం 120 దరఖాస్తులు వచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారతీయ రైల్వే నెట్​వర్క్​ ద్వారా ప్యాసింజర్​ రైళ్లను నడపడానిరి ప్రైవేట్​ పెట్టుబడులను ఆకర్షించే మొదటి ప్రధాన ప్రయత్నానికి అద్రభతమైన స్పందన వచ్చిందని రైల్వే శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 30 వేల కోట్ల ప్రైవేటు రంగ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పారదర్శక రెండు దశల పోటీ, బిడ్డింగ్​ ప్రక్రియల ద్వారా ఈ ప్రాజెక్టు చేపట్టే ప్రైవేట్​ సంస్థను ఎంపిక చేసినట్లు ఎంవోఆర్​ తెలిపింది.

క్లస్టర్లవారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలు
క్లస్టర్వచ్చిన ఆర్ఎఫ్​క్యూలు
ముంబై-19
ముంబై-212
దిల్లీ-110
దిల్లీ-212
చండీఘడ్9
హౌరా9
పాట్నా9
ప్రయాగ్​రాజ్10
సికింద్రాబాద్10
జైపూర్10
చెన్నై9
బెంగళూరు11

ఇదీ చదవండిః ఇకపై అమెజాన్​లో రైలు టికెట్ల బుకింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.