ETV Bharat / sports

భారత్​కు ఒలింపిక్ అథ్లెట్లు.. సాయంత్రం సన్మానం

author img

By

Published : Aug 9, 2021, 12:31 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన అథ్లెట్లకు దిల్లీలోని ఓ హోటల్​లో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హోటల్​ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ విశ్వక్రీడల్లో నీరజ్​ చోప్డా(స్వర్ణం), మీరాబాయి చాను, రవి దహియకు రజతం, పీవీ సింధు, లవ్లీనా, భజరంగ్​ పునియా, హాకీ పురుషుల జట్టుకు కాంస్య పతకాలు వచ్చాయి.

oly
ఒలింపిక్స్​

టోక్యో ఒలింపిక్స్​లో పతకాలు సాధించిన భారత అథ్లెట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనుంది స్పోర్ట్స్​ అథారిటీ ఆఫ్​ ఇండియా. నేడు(ఆగస్టు 9) సాయంత్రం ఆరు గంటలకు దిల్లీలోని హోటల్​ అశోక్​లో ఈ సన్మాన సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హోటల్​ వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు.

ఈ విశ్వక్రీడల్లో భారత్​ ఏడు పతకాలను సాధించింది. ఇప్పటివరకు విశ్వక్రీడల్లో ఇండియా​కు ఇదే అత్యుత్తమం. నీరజ్​ చోప్రా(స్వర్ణం), మీరాబాయి చాను, రవిదహియకు రజతం, పీవీ సింధు, లవ్లీనా, భజరంగ్​ పునియా, హాకీ పురుషుల జట్టుకు కాంస్య పతకాలు వచ్చాయి.

ఇదీ చూడండి: Olympics 2020: ఈ ఒలింపిక్స్​లో 'భారత' పతక విజేతలు వీరే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.