ETV Bharat / sports

పసిడితో నీరజ్​ మెరిసే.. భారత శిబిరం మురిసే!

author img

By

Published : Aug 8, 2021, 1:06 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో దేశానికి స్వర్ణం తెచ్చిన నీరజ్​ చోప్డాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఇతడు విజయం సాధించగానే ఒలింపిక్​ గ్రామంలోని భారత శిబిరంలో ఉన్న అథ్లెట్లు ఆనందంతో పులకరించిపోయారు. కేరింతలు కొడుతూ నీరజ్​ను హత్తుకుని ప్రశంసలతో ముంచెత్తారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

olympics
ఒలింపిక్స్​

నీరజ్​ చోప్డా.. ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతున్న పేరు. ఒలింపిక్స్​ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్​ కలను నెరవేర్చాడు ఘనుడు చోప్డా. జావెలిన్​ త్రో ఫైనల్లో గెలిచిన ఇతడు మువ్వన్నెల జెండాకు పసిడి కాంతులద్దాడు. దీంతో ఇతడిపై యావత్​ దేశమంతటా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ఇతడు విజయం సాధించి తిరిగి రాగానే ఒలింపిక్​ గ్రామంలోని భారత శిబిరంలో ఉన్న మన అథ్లెట్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సంబురాలు చేసుకున్నారు. కేరింతలు కొడుతూ నీరజ్​ను హత్తుకుని శుభాకాంక్షలు తెలుపారు. ప్రశంసలతో అతడిని ముంచెత్తారు. వీరిలో బాక్సింగ్​ కోచ్​ చోటే లాల్​ యాదవ్​, పురుషుల హాకీ గోల్​కీపర్​ పీఆర్​ శ్రీజేష్​ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి..

భారత్‌కు ఒలింపిక్స్‌ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా(2008) తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్డా చరిత్ర సృష్టించాడు. ఆసియా, కామన్వెల్త్‌లో స్వర్ణ పతకాలు ముద్దాడిన నీరజ్‌ ఒలింపిక్స్‌ అర్హత పోటీల్లోనూ అగ్రస్థానంలో నిలిచాడు. అతడు 2021 మార్చిలో 88.07మీ, 2018, ఆసియా క్రీడల్లో 88.06మీ, 2020 జనవరిలో దక్షిణాఫ్రికాలో 87.87 మీ, 2021 మార్చిలో ఫెడరేషన్‌ కప్‌లో 87.80మీ, 2018, మేలో దోహా డైమండ్‌ లీగ్‌లో 87.43 మీ, 2021 జూన్‌లో కౌరెటనె గేమ్స్‌లో 86.79మీటర్లు ఈటెను విసిరి రికార్డులు సృష్టించాడు.

ఇదీ చూడండి: Olympics: చరిత్ర సృష్టించిన నీరజ్​ చోప్డా- భారత్​కు స్వర్ణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.