ETV Bharat / sports

ఫోన్​ నేలకేసి కొట్టి.. అభిమానికి క్షమాపణలు చెప్పిన రొనాల్డో

author img

By

Published : Apr 10, 2022, 10:30 PM IST

Cristiano Ronaldo: అభిమాని ఫోన్​ నేలకేసి కొట్టిన స్టార్​ ఫుట్​బాల్​ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో క్షమాపణలు తెలిపాడు. మరోవైపు ఈ విషయంపై విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

Cristiano Ronaldo outburst
cristiano ronaldo news

Cristiano Ronaldo: అభిమానులకు స్టార్‌ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో క్షమాపణలు తెలిపాడు. నిన్న ఎవర్టెన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌ను మాంచెస్టర్‌ యునైటెడ్స్ 1-0 తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లు పోడియంలోకి వెళ్తుండగా.. అభిమానులు హాయ్‌ చెబుతూ కరచాలనం ఇచ్చేందుకు పోటీపడుతున్నారు. అయితే ఓటమి కోపంతో ఉన్న రొనాల్డో ఓ ప్రేక్షకుడి ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రొనాల్డ్‌ తీరుపై విమర్శలు చెలరేగాయి. దీంతో క్రిస్టియానో ఫుట్‌బాల్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు.

"క్లిష్టమైన సమయాల్లో భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం సులువైన విషయం కాదు. నేను ప్రతిసారీ ఇతరుల పట్ల గౌరవభావం, ఓపికతోనే ఉంటాను. అందమైన గేమ్‌ను ఆస్వాదించే యువతకు ఆదర్శంగా నిలుస్తాం. నిన్న జరిగిన సంఘటనకు క్షమాపణలు చెబుతున్నా. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు నా అభిమానికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నా" అని క్రిస్టియానో రొనాల్డో పేర్కొన్నాడు. రొనాల్డో ఫోన్‌ను విసిరిగొట్టిన వీడియోను ఓ నెటిజన్‌ షేర్‌ చేశాడు. అయితే, ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. ఫిర్యాదు అందడం వల్ల దీనిపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: మైదానంలోకి రోహిత్​ అభిమాని.. కోహ్లీ ఫిదా.. ఏం చేశాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.