ETV Bharat / sports

ఆర్మీ స్టేడియానికి ఒలింపిక్స్ విజేత నీరజ్ చోప్డా​ పేరు!

author img

By

Published : Aug 21, 2021, 10:20 AM IST

టోక్యో ఒలింపిక్స్ గోల్డ్​ మెడలిస్ట్​ నీరజ్ చోప్డా (Neeraj Chopra) మరో అరుదైన గౌరవం దక్కించుకోనున్నాడు. పుణెలో ఆర్మీ స్టేడియానికి అతడి పేరు పెట్టనున్నారు! ఆగస్టు 23న ఈ కార్యక్రమం జరగనుంది.

neeraj chopra
నీరజ్ చోప్డా

పుణెలోని డిఫెన్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ అడ్వాన్స్​డ్​ టెక్నాలజీతో (డీఐఏటీ) పాటు ఆర్మీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్​ను (ఏఎస్​ఐ) రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh)​ ఆగస్టు 23న సందర్శించనున్నారు. దీనికి గోల్డ్​మెడలిస్ట్​ నీరజ్​ చోప్డా (Neeraj Chopra) పేరు పెట్టే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఆర్మీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్​ను సందర్శించినప్పుడు స్టేడియంలోని క్యాంపస్ పేరును నీరజ్​ చోప్డా ఆర్మీ స్పోర్ట్స్​ ఇన్​స్టిట్యూట్​, పుణె కంటోన్మెంట్​గా మార్చే అవకాశం ఉందని డిఫెన్స్​ పీఆర్​ఓ వెల్లడించారు. దీనితోపాటు 16 మంది ఒలింపిక్​ క్రీడాకారులను మంత్రి సత్కరించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన భవనం ప్రారంభోత్సవంలోనూ రాజ్​నాథ్​ పాల్గొంటారు. ఎం.టెక్, పీహెచ్​డీ విద్యార్థులతో కలిసి మాట్లాడుతారు.​

నీరజ్.. ప్రస్తుతం ఆర్మీలో నాయక్​ సుబేదార్​ హోదాలో పనిచేస్తున్నారు​. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్​లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. ​100 ఏళ్ల తర్వాత అథ్లెటిక్స్​లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.

ఇదీ చదవండి: భారత క్రికెటర్​పై ఆరోపణలు! పిచ్ రోలర్ దొంగిలించాడంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.