ETV Bharat / sports

గాయంతోనే పోరాడిన రహానె.. WTC ఫైనల్​లో తొలి 'భారత' హాఫ్​ సెంచరీ.. టెస్టుల్లో 5వేల పరుగులు!

author img

By

Published : Jun 9, 2023, 6:13 PM IST

Updated : Jun 9, 2023, 6:53 PM IST

WTC Final 2023 Rahane : ప్రతిష్ఠాత్మక వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​ ఫైనల్​లో టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్​​ అజింక్య రహానె అద్భుతంగా పోరాడాడు. గాయం ఇబ్బంది పెడుతున్నా.. వేలికి బ్యాండేజ్ వేసుకొని మరీ బ్యాటింగ్ చేశాడు. సెంచరీకి 11 పరుగుల దూరంలో ఔటైన అతడు.. పలు రికార్డులను సాధించాడు.

Etv Bharat
Etv Bharat

WTC Final 2023 Rahane : ఇంగ్లాండ్​లోని ఓవల్​ వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వరల్డ్​ టెస్ట్​ ఛాంపియన్​ ఫైనల్​లో టీమ్​ఇండియా టాప్​ ఆర్డర్​ విఫలమైనా.. స్టార్​ బ్యాటర్​ అజింక్య రహానె అద్భుతంగా పోరాడాడు. 71 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును రహానే అసాధారణ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ముందుగా రవీంద్ర జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన రహానె.. రెండో రోజు శ్రీకర్ భరత్ ఔటైనా తన వంతు కృషి చేశాడు.

అయితే డబ్ల్యూటీసీ ఫైనల్​ మ్యాచ్​లో రెండో రోజు బ్యాటింగ్ చేస్తుండగా రహానె చేతి వేలికి గాయమైంది. ఆ వేలికి బ్యాండేజ్ వేసుకొని బ్యాటింగ్ చేసిన రహానె.. మూడో రోజు కూడా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేశాడు. మరోసారి బంతి గాయంపైనే తాకడంతో నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేయగా.. రహానె మొండిగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో టెస్ట్ ఫార్మాట్‌లో 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 13వ భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. 141 ఇన్నింగ్స్‌ల్లో రహానే.. 26 హాఫ్ సెంచరీలు, 12 శతకాలు నమోదు చేశాడు.

టెస్ట్‌ల్లో అతడి అత్యధిక స్కోర్ 188 కాగా.. సగటు 39.09గా ఉంది. అంతేకాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. సెంచరీకి 11 పరుగుల దూరంలో ఔటైన రహానె.. శార్దూల్‌తో కలిసి 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నాడు. దాంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో 100 ప్లస్ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేసిన జోడీగా రహానె-శార్దూల్ చరిత్రకెక్కారు.

ఇకపోతే.. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్సింగ్స్‌లో 469 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. ట్రావిస్ హెడ్ (174 బంతుల్లో 25 ఫోర్లు, సిక్స్‌తో 163), స్టీవ్ స్మిత్(268 బంతుల్లో 19 ఫోర్లతో 121) సెంచరీలతో చెలరేగారు. అలెక్స్ క్యారీ (69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), డేవిడ్ వార్నర్ (60 బంతుల్లో 8 ఫోర్లతో 43) విలువైన పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌ నాలుగు వికెట్లకు తోడుగా మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది.

Last Updated : Jun 9, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.