ETV Bharat / sports

వీరేంద్ర సెహ్వాగ్​కు నెపోటిజం సెగ.. ఫైర్​ అవుతున్న నెటిజన్లు

author img

By

Published : Dec 8, 2022, 8:05 AM IST

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్​కు నెపోటిజం సెగ తగిలింది. ఎక్కడి కెళ్లినా నెపోటిజం తప్పట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

nepotism trolls on virender sehwag son
nepotism trolls on virender sehwag son

టీమ్ ​ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్​ పెద్ద కుమారుడు ఆర్యవీర్​ సెహ్వాగ్​పై నెపోటిజం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడికి వెళ్లినా నెపోటిజం తప్పట్లేదంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు నెటిజన్లు. సచిన్​ తెందూల్కర్​ కూమారుడు అర్జున్​ తెందూల్కర్​ విషయం కూడా ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

డేరింగ్​, డ్యాషింగ్​ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్​​ కుమారుడు ఆర్యవీర్​ సెహ్వాగ్​ కుడా క్రికెట్​నే కెరీర్​గా ఎంచుకున్నాడు. కాగా, తాజాగా దిల్లీ క్రికెట్​ జట్టులో ఆర్యవీర్​కు చోటు లభించింది. 2022-23కి గాను విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా దిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్, తమ క్రికెట్ జట్టును ప్రకటించింది. 15 మందిలో కూడిన అండర్-16 టీమ్​లో ఆర్యవీర్ పేరు కూడా ఉంది. తుది జట్టులో చోటు దక్కకపోయినా.. వీరూ ఆర్యవీర్​ 15 మందిలో ఉన్నాడు. అయితే ఆర్యవీర్ తుది జట్టులో లేకపోయినా.. నెపోటిజం అని కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తన ఇన్‌ఫ్లూయెన్స్​తో వీరేంద్ర సెహ్వాగ్​​ తన కుమారుడిని అండర్ - 16 టీమ్​లో చేర్పించాడని విమర్శిస్తున్నారు. ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నా ఆర్యవీర్ పేరును చేర్చడానికి గల కారణాలను డీడీసీఏ వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు నెపోటిజం సినిమాల్లో, రాజకీయాల్లో చూశాం.. ఇప్పుడు క్రికెట్​లోకి కూడా వచ్చేసింది అని ట్రోల్​ చేస్తున్నారు. కాగా సచిన్​ తెందూల్కర్​.. అర్జున్​ తెందూల్కర్​పై కూడా నెపోటిజం విమర్శలు వచ్చాయి.

ఇవీ చదవండి : 'నా ఫ్యామిలీని బలి చేయలేను'.. ఆసీస్​ క్రికెట్​ బోర్డ్​పై వార్నర్​ ఫుల్​ సీరియస్​

నాయకా.. నీ పోరాటం అమోఘం!.. దెబ్బ తగిలిన విషయం అసలు గుర్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.