ETV Bharat / sports

IND VS SA: డికాక్ సూపర్​​ సెంచరీ.. టీమ్​ఇండియా లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Jan 23, 2022, 6:08 PM IST

Updated : Jan 23, 2022, 7:15 PM IST

IND VS SA: టీమ్​ఇండియాతో జరగుతోన్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌట్​ అయింది. క్వింటన్​ డికాక్​ సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా 2, దీపక్​ చాహర్​ 2, చాహల్​ 1 వికెట్​ తీశారు.

IND VS SA third ODI
IND VS SA third ODI

IND VS SA: ప్రస్తుతం జరుగుతోన్న నామమాత్రమైన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు బాగానే రాణించారు. క్వింటన్​ డికాక్​(124) సెంచరీ, రస్సీ వన్​డర్​ డస్సెన్​(52) అర్ధశతకం తోడవ్వడం వల్ల ప్రత్యర్థి జట్టు.. టీమ్​ఇండియా ముందు 288 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను వీరిద్దరూ కలిసి ఆదుకున్నారు. 144 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ కృష్ణ 3, బుమ్రా 2, దీపక్​ చాహర్​ 2, చాహల్​ 1 వికెట్​ దక్కించుకున్నారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం దక్కలేదు. జన్నెమన్​ మలన్​(1).. చాహర్​ బౌలింగ్​లో 2.1వ ఓవర్​ వద్ద పంత్​ చేతికి క్యాచ్​ ఇచ్చి తొలి వికెట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బవుమా(8) రెండో కీలక వికెట్​ను కోల్పోయింది. అతడు రనౌట్​గా పెవిలియన్​ చేరాడు. చాహల్​ వేసిన 6.3వ ఓవర్​లో రాహుల్​ డైరెక్ట్​ త్రో విసరడం వల్ల బవుమా రనౌటయ్యాడు. అనంతరం దీపక్​ చాహర్​ బౌలింగ్​లో మార్​క్రమ్​(15) రుతురాజ్​ గైక్వాడ్​కు క్యాచ్​ ఇచ్చి మూడో వికెట్​గా వెనుదిరిగాడు. అయితే డికాక్​ మాత్రం భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అతడు స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడిన అతడిని బుమ్రా కట్టడి చేశాడు. డికాక్​ భారీ షాట్​కు యత్నించి శిఖర్​ ధావన్​ చేతికి చిక్కాడు. దీంతో 214 పరుగుల వద్ద నాలుగో వికెట్​ను దక్షిణాఫ్రికా కోల్పోయింది. ఇక దూకుడిన మరో ప్లేయర్​ రస్సి వన్​డర్​ డస్సెన్​ను చాహల్​ బౌలింగ్​లో ఔట్​ అయ్యాడు. ఆరో వికెట్​గా పెహులుక్వాయో(4) పెవిలియన్​ చేరాడు. అనంతరం ప్రిటోరియన్​(20)-మిల్లర్​(39) జోడీ క్రీజులో పాతుకుపోయి స్కోరు బోర్డును మళ్లీ పరుగులెత్తించింది. ఆ తర్వాత ప్రిటోరియన్​, కేశవ్​ మహరాజ్​, డివిడ్​ మిల్లర్​, సిసంద మంగళ అందరూ ఔట్​ అయిపోయారు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

సయ్యద్​ మోదీ టోర్నీ​ విజేతగా పీవీ సింధు

Last Updated : Jan 23, 2022, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.