ETV Bharat / sports

కోహ్లీ తాగే వాటర్‌ బాటిల్​ ధర తెలిస్తే షాక్​!

author img

By

Published : Aug 22, 2021, 9:23 PM IST

టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ ఫిట్​నెస్​కు​ ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక డైట్​ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తాడు. అయితే అతడు​ తాగే నీళ్ల బాటిల్​ ధర తెలిస్తే మీరు షాక్​ అవ్వాల్సిందే. ఇంతకీ దాని ధర ఎంతంటే..

kohli
కోహ్లీ

భారత క్రికెట్‌ జట్టులో ఉన్న క్రికెటర్స్‌ అందరితో పాటు టీమ్‌ ఇండియా సారథి విరాట్ కోహ్లీ కూడా ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తాడు. అతడు చేసే వర్కౌట్‌ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో పంచుకుంటాడు కూడా. ఇక అతడి డైట్‌ విషయానికొస్తే ఆచితూచి వ్యవహరిస్తాడు. ఇవి కేవలం ఆహారానికే వర్తిస్తాయనుకుంటే పొరపాటే.. అతడు మినరల్‌ వాటర్​కు బదులు 'బ్లాక్‌ వాటర్‌'ను సేవిస్తాడట. ఈ బాటిల్‌ లీటర్‌ ధర తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు మరి. ఎందుకంటారా.. మినరల్‌ వాటర్‌ బాటిల్‌ లీటర్‌ రూ.20-40 ఉంటే.. బ్లాక్‌ వాటర్‌ లీటర్‌ ధర రూ.3000-4000 ఉంటుందట. ఇది ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి అవుతుంది. కరోనా ప్రారంభం నుంచి బ్లాక్‌ వాటర్‌ తాగడం మొదలెట్టాడు కోహ్లీ. కేవలం విరాట్​ మాత్రమే కాదు, బాలీవుడ్‌ హీరోయిన్లు ఊర్వశి రౌటేలా మలైకా అరోడా, దక్షిణాది తార శ్రుతిహాసన్‌ ఫిట్‌గా ఉండేందుకు ఇదే సేవిస్తున్నారు.

black water
బ్లాక్​ వాటర్​

అసలేమిటీ 'బ్లాక్‌ వాటర్‌'.. వాటి లాభాలు

బ్లాక్‌ వాటర్‌లో సహజసిద్ధమైన అల్కలైన్‌ ఉంటుంది. ఇవి మీ శరీరాన్ని హైడ్రేటెడ్‌, ఫిట్‌గా ఉండేలా చేస్తుంది. తద్వారా వ్యాధులు నుంచి దూరం ఉండొచ్చు. ఇందులో ఉండే 70 శాతం ఖనిజాలు మీ జీర్ణప్రక్రియ, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మనం రోజూ తాగే నీరులో pH స్థాయి 7 మాత్రమే ఉంటే.. బ్లాక్‌ వాటర్‌లో 7 కంటే ఎక్కువ ఉండటం గమనార్హం. అందుకే ఇందులో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి. చర్మం యవ్వనంగా ఉండేందుకు తోడ్పడుతుంది. గుజరాత్‌లోని వడోదరలోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే అంకుర సంస్థ 'ఎవోకస్‌' పేరుతో బ్లాక్‌వాటర్‌ తయారీని ప్రారంభించింది.

ఇదీ చూడండి: 'కోహ్లీ దూకుడు నాకూ ఇష్టమే.. కానీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.