ETV Bharat / sports

'అప్పుడే నేను టీ20 బౌలర్‌గా మారిపోయా'

author img

By

Published : Nov 5, 2021, 8:47 AM IST

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా అఫ్గాన్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravi Ashwin News). అద్భుతంగా బౌలింగ్ చేసి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. శుక్రవారం భారత్, స్కాట్లాండ్ మ్యాచ్​ నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడాడు. తాను టీ20 ఫార్మాట్ బౌలర్​గా ఎదిగిన తీరును వివరించాడు.

R ashwin
రవిచంద్రన్ అశ్విన్

నాలుగేళ్ల తర్వాత భారత జట్టు తరఫున పొట్టి ఫార్మాట్‌లో క్రికెట్‌ ఆడిన రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravi Ashwin News) తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో(T20 World Cup 2021) తొలి రెండు మ్యాచ్‌లకు తనను పక్కన పెట్టడం ఎంత పొరపాటో టీమ్‌ఇండియా యాజమాన్యానికి తెలిసొచ్చేలా చేశాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌ (4-0-14-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. గుల్బాడిన్ నైబ్, జద్రాన్‌ వంటి కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. శుక్రవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా అశ్విన్‌ ప్రెస్‌ మీట్‌లో మాట్లాడాడు.

"జీవితం చక్రంలాంటిదని నమ్ముతుంటా. కొందరికి చిన్నది.. మరికొందరికి పెద్దది. చీకటి దశను దాటే వరకు ఓపికగా ఉండలి. రెండేళ్లుగా జీవిత గమనం ఎలా ఉంటుందో గమనిస్తూ వచ్చాను. నేను మంచి ఫామ్‌లో ఉన్నా లేకపోయినా నాకంటూ కొన్ని బంధనాలను ఏర్పరచుకున్నా. సుదీర్ఘకాలం నిశ్చలంగా గడిపేందుకు ప్రయత్నించా. వైఫల్యాలు ఎందుకు వచ్చాయనే దాని గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. విజయవంతమైన సమయాల్లో వినయంగా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. అయితే దానిని నేను గట్టిగా స్వీకరించి ఆచరించాను"

-రవిచంద్రన్ అశ్విన్, టీమ్​ఇండియా స్పిన్నర్.

కెరీర్‌లో విజయాల కంటే వైఫల్యాలే అధికంగా ఉండాలని షేన్‌వార్న్‌ చెప్పిన ఫిలాసఫీ సరైందిగా అనిపించిందని అశ్విన్‌ పేర్కొన్నాడు. సక్సెస్‌ గురించి షేన్‌ వార్న్‌ ఓసారి చెప్పిన మాటలను అతడు గుర్తుచేసుకున్నాడు. "నీకు సక్సెస్‌ రేట్‌ 33 శాతమే. సచిన్‌ కూడా తన కెరీర్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. వారే అలా ఉంటే.. ఇక నేనెవరిని? నేనేమీ అతీతుడిని కాదు కదా.. స్ఫూర్తిని కోల్పోవడం, ఆశలను వదులుకోవడం చాలా సులువు. అవన్నీ వదిలేసి ఇతరులపై ఫిర్యాదు చేయడంపైనే కొందరు ఉంటారు. నేనైతే అలా చేయలేను. తన తప్పు లేకుండానే బయటకి వెళ్లిపోతే పరిష్కారం ఏంటి? అత్యంత సులభమైన పద్ధతి ఏంటంటే.. వృత్తిపరంగా ముందుకెళ్లడమే. సన్నద్ధతను కొనసాగించడం, గట్టిగా కృషి చేయడం, అవకాశం కోసం ఎదురు చూస్తుండటం. ఏదో ఒకరోజు అవకాశం నీ తలుపు తడుతుంది. 2017లో ఎప్పుడైతే టీ20 జట్టులో చోటు కోల్పోయానో.. అప్పుడే నన్ను నేను టీ20 ఫార్మాట్‌ బౌలర్‌గా తీర్చిదిద్దుకున్నా. జీవిత చక్రం ఎప్పటికీ ఆగదు" అని అశ్విన్‌ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఇదీ చదవండి:

మ్యాచ్​ మధ్యలో కెప్టెన్ కోహ్లీ క్రేజీ డ్యాన్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.