ETV Bharat / sports

T20 World Cup 2021: పాజిటివ్‌ వస్తే పది రోజుల ఐసొలేషన్‌

author img

By

Published : Oct 10, 2021, 6:36 AM IST

మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచకప్(T20 World Cup 2021) ప్రారంభంకాబోతుంది. కరోనా తగ్గుముఖం పడుతున్న తర్వాత జరగనున్న తొలి మెగాటోర్నీ ఇదే కావడం విశేషం. ఈ నేపథ్యంలో టోర్నీ(t20 world cup schedule) కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఐసీసీ సమగ్రత, బయో రక్షణ విభాగాధిపతి అలెక్స్‌ మార్షల్‌. పాజిటివ్​ వచ్చిన వారిని పది రోజుల పాటు ఐసోలేషన్​లో ఉంచనున్నట్లు తెలిపారు.

icc
ఐసీసీ

కరోనా మహమ్మారి (T20 Worldcup news)తర్వాత ఐసీసీ నిర్వహించే తొలి ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతోంది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్‌(t20 world cup time table 2021) ఈ నెల 17న ఆరంభం కానుంది. కొవిడ్‌ నేపథ్యంలో పటిష్ఠమైన బబుల్‌లో నాలుగు వేదికల్లో ఈ 16 జట్ల పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఐసీసీ సమగ్రత, బయో రక్షణ విభాగాధిపతి అలెక్స్‌ మార్షల్‌ తెలిపాడు. రెండు దేశాల్లోని నాలుగు వేదికల్లో(t20 world cup venue 2021) టోర్నీని నిర్వహించడం క్లిష్టతరమైందని అతనన్నాడు. బబుల్‌లో ఎవరైనా పాజిటివ్‌గా తేలితే వాళ్లను 10 రోజుల పాటు ఐసోలేషన్‌లో(icc corona rules) ఉంచనున్నట్లు వెల్లడించాడు.

"బబుల్‌లో పాజిటివ్‌గా(icc corona rules) తేలిన వాళ్లు లక్షణాలు లేకపోయినప్పటికీ పది రోజుల ఐసొలేషన్‌లో కచ్చితంగా ఉండాలి. వాళ్లతో సన్నిహితంగా మెలిగిన వాళ్లు ఆరో రోజులు ఐసొలేషన్‌లో గడపాల్సిందే. బబుల్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తాం. ఈ టోర్నీ ఎంత ముఖ్యమో ఆటగాళ్లు అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. ఎవరూ నిబంధనలు అతిక్రమించరనే అనుకుంటున్నా. పరిమిత సంఖ్యలో కుటుంబ సభ్యులను ఆటగాళ్లతో కలిసి ఉండేందుకు అనుమతించాం. క్రికెటర్లు ఒత్తిడిని తగ్గించుకుని ఆటను ఆస్వాదించేందుకు కుటుంబ సభ్యులు దగ్గరగా ఉండడం అవసరం. ప్రేక్షకుల విషయంలో స్థానిక ప్రభుత్వాల నిబంధనల మేరకే నడుచుకుంటాం. ఒమన్‌, అబుదాబిలో(t20 world cup venue 2021) మ్యాచ్‌లు చూసేందుకు స్టేడియాలకు రావాలనుకునే వాళ్లు కచ్చితంగా రెండు డోసుల టీకా తీసుకుని ఉండాలి. దుబాయ్‌, షార్జాలో అయితే అవసరం లేదు. ఏ స్టేడియంలోనైనా ప్రేక్షకులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాల్సిందే"

-అలెక్స్‌, ఐసీసీ సమగ్రత, బయో రక్షణ విభాగాధిపతి.

అక్టోబర్​ 17 నుంచి నవంబరు 14వరకు టీ20 ప్రపంచకప్​కు జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్​ జట్టుకు మెంటార్​గా మాజీ సారథి ధోనీని(dhoni mentor in t20 world cup) నియమించారు.

టీమ్ఇండియా స్క్వాడ్​:(t20 world cup 2021 indian team):

విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), రోహిత్​ శర్మ(వైస్​ కెప్టెన్​), కేఎల్ రాహుల్​, సూర్య కుమార్ యాదవ్​, రిషభ్​ పంత్​(వికెట్ కీపర్​), ఇషాన్​ కిషన్​(వికెట్​ కీపర్), హార్దిక్​ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్​ చాహర్​, రవిచంద్రన్​ అశ్విన్​, అక్షర్​ పటేల్​, వరుణ్​ చక్రవర్తి, జస్ప్రిత్​ బుమ్రా, భువనేశ్వర్​ కుమార్​, మహ్మద్​ షమీ.

స్టాండ్​బై ప్లేయర్స్​: శ్రేయస్​ అయ్యర్​, శార్దూల్​ ఠాకూర్​, దీపక్​ చాహర్​.

ఇదీ చూడండి: T20 World Cup 2021: మెగాటోర్నీలో ఎవరికైనా కరోనా సోకితే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.