ETV Bharat / sports

T20 Worldcup: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా ఓటమి

author img

By

Published : Feb 18, 2023, 9:44 PM IST

Updated : Feb 18, 2023, 10:49 PM IST

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా అమ్మాయిలు 11 పరుగుల తేడాతో ఓడిపోయారు. ఆ మ్యాచ్​ వివరాలు..

T20 Worldcup: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా ఓటమి
T20 Worldcup: ఇంగ్లాండ్​పై టీమ్​ఇండియా ఓటమి

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్​ఇండియా మహిళలు తొలి ఓటమిని ఎదుర్కొన్నారు. ఇంగ్లాండ్‌ చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిపోయారు. 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి టీమ్​ఇండియా నిర్ణీత 20 ఓవర్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు మాత్రమే చేసింది. స్మృతిమంధాన(52) హాఫ్ సెంచరీ చేయగా.. చివర్లో వచ్చిన రీచా ఘోస్​(47*) బాగా రాణించి స్కోరు బోర్డును పరుగులెత్తించింది. ఇంగ్లీష్ బౌలర్లలో సారా గ్లెన్​ 2, సోఫీ ఎక్లెస్టోన్​, లారెన్ బెల్​ తలో వికెట్ తీశారు.

ఆరంభంలో .. చివర్లో.. లక్ష్య ఛేదనలో టీమ్​ఇండియా అమ్మాయిలు ఆరంభంలో దూకుడుగా.. చివర్లో దూకుడుగా ఆడారు. మిడిల్‌ ఓవర్లలో బ్యాటర్లు పరుగుల చేయలేకపోయారు. ఓపెనర్​ స్మృతీ మంధాన (52) దూకుడుగానే ప్రారంభించింది. ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా సరే వేగం మాత్రం ఆపలేదు. కానీ, ఆమెకు తోడుగా క్రీజులో నిలబడేవారు లేకుండా పోయారు. అయితే, రిచా ఘోష్ (47*) చివర్లో వచ్చి దూకుడుగా ఆడింది. కానీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. భారత బౌలర్లలో రేణుకా ఐదు వికెట్లు తీసింది. అయితే ఈ విజయంతో .. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన ఇంగ్లాండ్‌కు దాదాపుగా సెమీస్‌ బెర్తు ఖరారైంది.

రేణుకా ఐదు వికెట్ల ప్రదర్శన.. ఈ మ్యాచ్​లో రేణుకా సింగ్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి ఓ రికార్డు సాధించింది. టీ 20 వరల్డ్‌కప్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత మహిళా పేసర్‌గా రికార్డుకెక్కింది. అంతేకాదు ఈ ప్రపంచకప్​లో రేణుకా కెరీర్‌ బెస్ట్‌ పెర్​ఫార్మెన్స్​ చేసింది. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులు మాత్రమే ఇచ్చింది. తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడగొట్టిన రేణుకా.. చివరి ఓవర్‌లో మరో రెండు వికెట్లు తీసి అదరగొట్టింది. డంక్లీ, అలిస్‌ క్యాప్సీ, వ్యాట్‌, అమీ జోన్స్‌, బ్రంట్‌ల పెవిలియన్ చేర్చి ఐదు వికెట్ల ఘనతను అందుకుంది. ఇకపోతే భారత్‌ తన చివరి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే భారత్‌కు గ్రూప్‌ -బీ నుంచి రెండో సెమీస్‌ బెర్తు ఖరారవుతుంది.

ఇదీ చూడండి: పంత్ హెల్త్​పై ఊర్వశి రౌతేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్​

Last Updated : Feb 18, 2023, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.