ETV Bharat / sports

టీమ్ఇండియాకు వీళ్లే కీలకం!- సఫారీ గడ్డపై ఎవరి ప్రదర్శన ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 9:56 AM IST

Rohit Virat Rahul Against South Africa Test : సౌతాఫ్రికా పర్యటనలో అందరూ ఎదురుచూస్తున్న టెస్టు సిరీస్​కు సమయం ఆసన్నమైంది. వరల్డ్​కప్ తర్వాత కెప్టెన్ రోహిత్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలిసారి బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటివరకు సౌతాఫ్రికాలో జరిగిన టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్లు రోహిత్, విరాట్, కేఎల్ రాహుల్​లో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో తెలుసుకుందాం.

Rohit Virat Rahul Against South Africa Test
Rohit Virat Rahul Against South Africa Test

Rohit Virat Rahul Against South Africa Test : సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్​ను టీమ్ఇండియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సఫారీ గడ్డపై తొలి సిరీస్ సాధించిన భారత జట్టుగా నిలవాలని టీమ్ఇండియా తహతహలాడుతోంది. ఈ క్రమంలో బ్యాటింగ్​లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్​ కీలకం కానున్నారు. ప్రస్తుత జట్టులోనూ అనుభవం ఉన్న బ్యాటర్లు వీళ్లే కావడం విశేషం. మరి ఇదివరకు సౌతాఫ్రికాలో జరిగిన టెస్టుల్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం.

రోహిత్ శర్మ : సఫారీ గడ్డపై టెస్టుల్లో రోహిత్ రికార్డు అంతగా ఆశించిన స్థాయిలో లేదు. గతంలో రోహిత్ 2013-14, 2017-18 సిరీస్​ల్లో రెండేసి మ్యాచ్​లు ఆడాడు. మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్​ల్లో రోహిత్ కేవలం 123 పరుగులే చేశాడు. అందులో 47 పరుగులు టాప్ స్కోర్. ఇక ఓవరాల్​గా చూస్తే సౌతాఫ్రికాపై రోహిత్​కు మెరుగైన రికార్డే ఉంది. సఫారీలతో రోహిత్ 9 టెస్టు మ్యాచ్​లు ఆడాడు. 42.37 సగటుతో 678 పరుగులు చేశాడు. అందులో మూడు సెంచరీలు ఉన్నాయి. ఆ మూడు సెంచరీలు కూడా 2019-20 స్వదేశంలో జరిగిన సిరీస్​లో రావడం గమనార్హం.

  • Sanjay Bangar said, "The way Rohit Sharma changed his approach in the Test series in England was fantastic and I hope he does the same here." [Star Sports] pic.twitter.com/X0MjtqT5BJ

    — Vishal. (@SPORTYVISHAL) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విరాట్ కోహ్లీ : సౌతాఫ్రికాలో విరాట్​కు ఘనమైన రికార్డు ఉంది. ఏడు టెస్టు మ్యాచ్​ల్లో విరాట్ 51.35 సగటుతో 719 పరుగులు బాదాడు. 2013లో తొలిసారి సఫారీ గడ్డపై ఆడిన విరాట్ మొదటి మ్యాచ్​లోనే 272 పరుగులు చేశాడు. తర్వాత 2017-18 సిరీస్​లో 286 పరుగులు, 2021-22 సిరీస్​లో 161 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్​గా 14 మ్యాచ్​ల్లో 56.18 సగటుతో 1236 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుత టీమ్ఇండియాలో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్ విరాట్ కోహ్లీయే.

కేఎల్ రాహుల్ : ప్రస్తుత పర్యటనలో రోహిత్, విరాట్ తర్వాత అత్యంత నాణ్యమైన ప్లేయర్ కేఎల్ రాహుల్. సౌతాఫ్రికాలో రాహుల్ 5 మ్యాచ్​లు ఆడాడు. అందులో 256 పరుగులు నమోదు చేసి ఫర్వాలేదనిపించాడు. తొలిసారి 2017-18 సిరీస్​లో రెండు మ్యాచ్​ల్లో కలిపి కేవలం 30 పరుగులే చేశాడు. ఇక 2020-21 సిరీస్​లో అదరగొట్టే ప్రదర్శనతో రెండు మ్యాచ్​ల్లోనే 236 పరుగులు చేసి రాణించాడు.

'ఆ విషయం ప్లేయర్లకు బాగా తెలుసు' ప్రపంచకప్​ ఓటమిపై ద్రవిడ్​ కీలక వ్యాఖ్యలు

అందరూ టీమ్ఇండియాకు ఆడాలనుకుంటారు- వరల్డ్​కప్​ను దేనితోనూ పోల్చలేం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.