ETV Bharat / sports

ఇంగ్లాండ్ జట్టు కోసం రూట్ త్యాగం.. ఐపీఎల్​కు దూరం

author img

By

Published : Jan 17, 2022, 3:55 PM IST

Joe root ipl 2022: ఈ ఏడాది ఐపీఎల్​ వేలం​లో పాల్గొనడం లేదని స్పష్టం చేశాడు ఇంగ్లాండ్​ టెస్టు జట్టు కెప్టెన్​ జో రూట్​. యాషెస్​ సిరిస్​లో ఘోర పరాభవం అనంతరం జట్టు పునర్​నిర్మాణంపైనే పూర్తిగా దృష్టి సారించనున్నట్లు చెప్పాడు.

Haven't given my name for IPL mega auction, confirms Root
ఇంగ్లాండ్ జట్టు కోసం రూట్ త్యాగం.. ఐపీఎల్​కు దూరం

Joe root ipl 2022: ఈ ఏడాది జరిగే ఐపీఎల్​ వేలానికి తాను అందుబాటులో ఉంటానని కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చాడు ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్​ జో రూట్​. తాను మెగా వేలంలో పాల్గొనడం లేదని తెలిపాడు. ఆస్టేలియాతో జరిగిన యాషెస్​ సిరీగ్​ను 4-0 తేడాతో కోల్పోయిన అనంతరం మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

Haven't given my name for IPL mega auction, confirms Root
ఇంగ్లాండ్ జట్టు కోసం రూట్ త్యాగం.. ఐపీఎల్​కు దూరం

" ఈ ఏడాది ఐపీఎల్ వేలానికి నా పేరు ఇవ్వడం లేదు. ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు నేను ఇంకా చాలా చేయాల్సి ఉంది. అందుకు నా శాయశక్తులు అవసరం అవుతాయి. ఆ అవకాశం నాకు దక్కుతుందనే భావిస్తున్నా. ఇంగ్లాండ్​ టెస్టు క్రికెట్​కు అద్భుత ఆదరణ ఉంటుంది. నేను కూడా టెస్టు క్రికెట్​కే అత్యంత ప్రాధాన్యం ఇస్తా. అవసరమైతే జట్టు కోసం ఎలాంటి త్యాగమైనా చేసేందుకు సిద్ధం."

--జో రూట్​, ఇంగ్లాండ్ టెస్టు జట్టు సారథి.

స్టార్క్​ రిటర్న్​..

చాలా ఏళ్ల గ్యాప్​ తర్వాత ఐపీఎల్​కు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆస్ట్రేలియా స్టార్​ బౌలర్​ మిచెల్ స్టార్క్​ గతవారం చెప్పాడు. దాదాపు 6 సంవత్సరాలు ఈ టోర్నీకి దూరంగా ఉన్న అతడు.. ఈసారి ఆడనున్నట్లు తెలిపాడు. టీ20 ప్రపంచ కప్ ఈ ఏడాదే జరగనుండటం వల్ల ఐపీఎల్​ ఆడితే ఆ అనుభవం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టు షెడ్యూల్ ఎలా ఉన్నప్పటికీ.. టోర్నీలో ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

చివరగా ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున 27 మ్యాచ్​లు ఆడాడు స్టార్క్​. ఆ తర్వాత నుంచి టోర్నీకి దూరంగా ఉన్నాడు.

ఐపీఎల్​లో ఈ ఏడాది 10 జట్లు పాల్గొనబోతున్నాయి. అహ్మదాబాద్​, లఖ్​నవూ ప్రాంఛైజీలకు బీసీసీఐ ఇప్పటికే అధికారిక అనుమతులు ఇచ్చింది. కరోనా కేసులు తగ్గితే టోర్నీని భారత్​లోనే నిర్వహించనున్నారు. లేకపోతే విదేశాలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఇదీ చదవండి: 100వ టెస్టుకు కెప్టెన్సీ ఆఫర్​.. తిరస్కరించిన కోహ్లీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.