ETV Bharat / sports

IPL 2023: మద్దాలి శివారెడ్డా మజాకా.. ఆయన కామెంట్రీకి క్రికెట్ ఫ్యాన్స్​ ఫిదా!

author img

By

Published : Apr 1, 2023, 5:13 PM IST

స్థానిక భాషల్లో ప్రసారమవుతున్న ఐపీఎల్​ను అక్కడి సూపర్​ స్టార్స్​ కామెంట్రీ చేస్తున్నారు. తెలుగులో బాలయ్య చెప్పగా.. మిగతా భాషల్లో అక్కడి స్టార్​ యాక్టర్స్​ వ్యాఖ్యానం చేశారు. అయితే రేసుగుర్రం యాక్టర్​ రవి కిషన్ చెప్పిన కామెంటరీ హైలైట్​గా నిలిచింది. ఆ వివరారు..

Ravikishan IPL commentary
IPL 2023: మద్దాలి శివారెడ్డా మజాకా.. ఆయన కామెంట్రీకి క్రికెట్ ఫ్యాన్స్​ ఫిదా!

ఇండియన్ ప్రీమియర్ లీగ్​ 2023 సీజన్ గ్రాండ్​గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో గెలిచి సీజన్​ను విజయంతో ప్రారంభించింది డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్. అయితే ఆడియెన్స్​ను మరింత ఆకట్టుకునేందుకు ఐపీఎల్​ నిర్వాహకులు, ప్లేయర్స్​తో పాటు ఈ మెగాటోర్నీ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్(టెలివిజన్), జియో సినిమా(ఓటీటీ) కూడా రకరకాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటివరకు స్టార్ స్పోర్ట్సే అటు టెలివిజన్​కు, ఇటు డిజిటల్​కు అధికారిక బ్రాడ్ కాస్టర్‌గా వ్యవహరించగా.. ఈసారి హాట్‌స్టార్‌తో రిలయన్స్​ జియో కూడా రేసులోకి దిగింది. దీంతో ఈ రెండు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. లీగ్ క్యాంపైన్ నుంచి ప్రత్యక్ష ప్రసారాల వరకు స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా.. రేటింగ్స్ కోసం బాగా ఖర్చు చేశాయి. స్థానిక భాషల్లో ప్రసారమవుతున్న ఈ లీగ్‌లో అక్కడి సూపర్ స్టార్స్‌తో కామెంట్రీ చెప్పించే ప్రయత్నాలు కూడా చేశాయి. ఈ క్రమంలోనే స్టార్ స్పోర్ట్స్.. తెలుగు‌లో నందమూరి నటసింహం బాలకృష్ణ చేత కామెంట్రీ చెప్పించగా.. భోజ్‌పురి భాషలో అక్కడి మెగాస్టార్, ఎంపీ రవి కిషన్ చేత కామెంట్రీ చెప్పించింది.

ఆయన కామెంటేటరి స్టైల్​కు క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆయన కామెంటేటరి చేసిన విధానికి తెలుగు అభిమానులైతే రేసుగుర్రం సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. ఆ చిత్రంలో ఆయన మద్దాలి శివా రెడ్డిగా విలన్​ పాత్రలో కనిపించారు. "నన్ను కొట్టేసి వెళ్లిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు ఫలానావాడు. వాడు మామూలోడు కాదు. వాడింకా చావలేదు. హాస్పిటల్​లోనే ఉన్నాడు. లేస్తే వస్తాడు. వస్తే ఏసేస్తాడు" అంటూ అల్లు అర్జున్‌ను వార్నింగ్​ ఇస్తూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది. ఇప్పుడా డైలాగ్​ స్టైల్​లోనే.. భోజ్‌పురి భాషలో రవి కిషన్ చెప్పిన కామెంటేటరీకి ఫ్యాన్స్ ఫుల్​ ఫిదా అవుతున్నారు. ఆయన కామెంటేటరి ముందు ఇంగ్లీష్, హిందీ కూడా తక్కువేనని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కామెంటేటరి చేస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా అవుతున్నాయి.

కాగా, రవి కిషన్​.. తన తల్లి ప్రోత్సాహంతో అలాగే తన కష్టంతో మంచి నటుడిగా గుర్తింపు పొందారు. భోజ్‌పురిలో హీరోగా, నటుడిగా ఆడియెన్స్​లో ఫుల్ క్రేజ్​ దక్కించుకున్నారు. బాలీవుడ్​తో పాటు సౌత్ ఇండస్ట్రీలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్ నటించిన​ 'రేసుగుర్రం'తో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చారు. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా అలరించారు. ఇంకా టాలీవుడ్​లో కిక్​ 2, ఒక అమ్మాయి తప్ప, సుప్రీమ్​, లై, రాధ, సాక్ష్యం, ఎమ్​ఎల్​ఏ, సైరా నరసింహారెడ్డి, ఎన్టీఆర్ కథానాయకుడు, హీరో వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. గతేడాది ఖాఖీ: ది బీహార్‌ చాప్టర్‌ వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించి అలరించారు.

  • మ్యాన్ ఆఫ్ ది మాసస్ మన లెజెండ్ బాలయ్య 🦁 గారు స్టుడియో లో సందడి మొదలుపెట్టేశారు 🥳💥

    మరింత #AataUnstoppable ఎంటర్టైన్మెంట్ కోసం, ఇంక లేట్ చెయ్యకుండా వెంటనే #StarSportsTelugu/HD & #MaaMovies పెట్టేయండి!! #IPLonStar #HusharuOn #GameOn 🔥 pic.twitter.com/p1IfpRHFLn

    — StarSportsTelugu (@StarSportsTel) March 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఆమె రాత్రికి రమ్మంది!.. క్యాస్టింగ్ కౌచ్​పై 'రేసు గుర్రం' యాక్టర్ షాకింగ్ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.