ETV Bharat / sports

మహిళా టీ20 ఛాలెంజ్​ షెడ్యూల్​పై ఓ లుక్కేయండి

author img

By

Published : Nov 3, 2020, 5:21 PM IST

మహిళా టీ20 ఛాలెంజ్ టోర్నీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. హర్మన్​ప్రీత్​ కౌర్ నేతృత్వంలోని సూపర్​ నోవాస్​, స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్​ బ్లేజర్స్​, మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్​పై ఓ లుక్కేద్దాం.

Women's T20 Challenge
మహిళా టీ20 ఛాలెంజ్

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మహిళా టీ20 ఛాలెంజ్ నవంబరు 4(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. యూఏఈలోని షార్జా వేదికగా ఈ లీగ్ జరగనుంది. హర్మన్​ప్రీత్​ కౌర్ నేతృత్వలోని సూపర్​ నోవాస్​, స్మృతి మంధాన నేతృత్వంలోని ట్రయల్​ బ్లేజర్స్​, మిథాలీ రాజ్ నేతృత్వంలోని వెలాసిటీ జట్లు తలపడనున్నాయి. భారత్‌తో పాటు ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ దేశాల మహిళా క్రికెటర్లు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీకి సంబంధించిన షెడ్యూల్​పై ఓ​ లుక్కేయండి.

schedule
షెడ్యూల్​

నవంబరు 4న తొలి పోరు సూపర్​ నోవాస్​-వెలాసిటీ మధ్య జరగనుంది. 5వ తేదీన వెలాసిటీ-ట్రయల్​ బ్లేజర్స్ మధ్య రెండో మ్యాచ్​ నిర్వహించనున్నారు. 7వ తేదీన ​ట్రయల్​ బ్లేజర్స్-సూపర్​ నోవాస్ తలపడనున్నాయి. ఇక నవంబరు 9న ఫైనల్​ జరుగుతుంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

స్క్వాడ్స్​

సూపర్​ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (సారథి), జెమిమా రోడ్రిగ్స్, చమరి అటపట్టు, ప్రియా పునియా, అనుజా పాటిల్, రాధా యాదవ్, తానియా భాటియా, శశికళ సిరివర్ధనే, పూనమ్ యాదవ్, షకీరా సెల్మన్, అరుంధతి రెడ్డి, పూజా​, ఆయుషి సోనీ, అయాబోంగా ఖాకా, ముస్కాన్ మాలిక్

ట్రయల్​ బ్లేజర్స్​ : స్మృతి మంధనా(సారథి), దీప్తి శర్మ , పూనమ్ రౌత్, రిచా ఘోష్, డి.హేమలతా, పర్వీన్​, రాజేశ్వరీ గైక్వాడ్​, హర్లీన్​ డియోల్​, ఝులాన్​ గోస్వామి, సిమ్రాన్​ దిల్​ బహదూర్​, సల్మా ఖాతున్​, సోఫీ, చంతం, డియాండ్రా డోటిన్, కశ్వీ గౌతమ్

వెలాసిటీ: మిథాలీ రాజ్ (సారథి), వేద కృష్ణమూర్తి, షఫాలీ వర్మ, సుష్మా వర్మ, ఏక్తా బిష్త్, మాన్సీ జోషి, శిఖా పాండే, దేవిక వైద్య, సుశ్రీ, మనాలి దక్షిణి, లీ కాస్పరక్​, డేనియల్ వాట్​, సూన్​ లస్​, జహనారా ఆలం, ఎం. అనాఘ

Women's T20 Challenge
మహిళా టీ20 ఛాలెంజ్

ఇదీ చూడండి 'అసలైన ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. కప్​ మాదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.