ETV Bharat / sports

'ధోనీని అందుకోవాలంటే పంత్​కు 15 ఏళ్లు పడుతుంది'

author img

By

Published : Dec 6, 2019, 5:09 PM IST

భారత్​ ఆడే మ్యాచ్​ల్లో వినిపించే 'ధోనీ.. ధోనీ' నినాదాలకు యువ క్రికెటర్ పంత్​ అలవాటు పడాలని చెప్పాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. మహీ ఘనతల్ని అందుకోవాలంటే అతడికి 15 ఏళ్లు పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

'ధోనీని పంత్​ అందుకోవాలంటే 15 ఏళ్లు పడుతుంది'
పంత్-ధోనీ

భారత యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌.. మైదానంలో ధోనీ నినాదాలు వినేందుకు అలవాటు పడాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. వాటిని వింటూనే ఒత్తిడి నుంచి బయటపడే మార్గం వెతకాలని సూచించాడు.

BCCI President Sourav Ganguly
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ

"ఆ నినాదాలు పంత్‌కు మంచివే. వాటికి అతడు అలవాటు పడాలి. అవి వింటూనే విజయవంతం కావడానికి దారి కనుక్కోవాలి. ఒత్తిడిని ఎదుర్కొంటూనే అతడు క్రికెట్లో తన ముద్ర వేయాలి. ప్రతిసారీ మనకు ఎంఎస్‌ ధోనీ అందుబాటులో ఉండడు. మహీ సాధించింది పంత్‌ సాధించాలంటే 15 ఏళ్లు పడుతుంది. భారత్‌కు అతడు చేసిన సేవలకు బీసీసీఐ కేవలం ధన్యవాదాలు చెబితే సరిపోదు. అతడి వీడ్కోలు సంగతి పక్కన పెట్టండి. మేం విరాట్‌, సెలక్టర్లతో మాట్లాడుతున్నాం. సమయం వచ్చినప్పుడు వివరాలు చెప్తాం" - సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు

ఐపీఎల్​లో మెరుపులు మెరిపించే పంత్‌.. అంతర్జాతీయ మ్యాచుల్లో ఒత్తిడికి గురవుతున్నాడు. ఫామ్‌ కోల్పోయాడు. కీపింగ్‌లో ప్రాథమిక అంశాల్లోనూ పొరపాట్లు చేస్తున్నాడు. ఈ విషయమై అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరూ కావాలని పొరపాట్లు చేయరని, పంత్‌ను ఏకాకిని చేయొద్దని టీమిండియా సారథి కోహ్లీ, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌.. ఇంతకు ముందే అతడికి అండగా నిలిచారు.

Young wicketkeeper-batsman Rishabh Pant
భారత యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌

ఇది చదవండి: భారత తొలి సెంచరీ వీరుడు.. వెండితెరపైకి వస్తున్నాడు..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 48 hours. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: The Australian Club, Sydney, Australia - 6th December 2019
1. 00:00 Establisher
2. 00:07 Abraham Ancer tee shot at hole 5
3. 00:22 Brett Rumford third shot at hole 8
4. 00:33 Chun-An Yu (a) fourth shot at hole 18
5. 00:46 Louis Oosthuizen second shot at hole 8
6. 01:02 Cameron Tringale second shot at hole 6
7. 01:20 Denzel Ieremia (a) third shot at hole 18
8. 01:35 Takumi Kanaya (a) birdie putt at hole 17
9. 01:50 Shae Wools-Cobb (a) birdie putt at hole 9
10. 02:07 Paul Casey second shot at hole 8
11. 02:27 Dimitrios Papadatos second shot at hole 4
12. 02:41 Matt Jones birdie shot at hole 8
13. 03:01 Matt Jones birdie putt at hole 14
SOURCE: Lagardere Sports
DURATION: 03:13
STORYLINE:
Matt Jones shot a 65 on Friday to take a one shot lead at 10-under-par after the second round of the Australian Open. .
Jones's Australian compatriot Dimitrios Papadatos (66) and Englishman Paul Casey )65) were tied for second at nine-under.   
Overnight joint leader Takumi Kanaya of Japan, South African Louis Oosthuizen, American Cameron Tringale and local amateurs Shae Wools-Cobb and Denzel Ieremia shared fourth place at 8-under.
Friday's low scoring came after the bushfire-driven haze that blanketed the course on Thursday afternoon cleared significantly for the second round.
The Australian Open is the first qualifier for next year's British Open to be held from July 16-19 at Royal St. George's.
The leading three players who finish in the top 10 and ties at the Australian Open who are not already exempt will qualify.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.