ETV Bharat / sports

దేశవాళీ లీగ్​తో రీఎంట్రీ ఇవ్వనున్న ధోనీ!

author img

By

Published : Apr 22, 2020, 11:52 AM IST

దేశవాళీ లీగ్​ సయ్యద్ ముస్తాక్​ అలీ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు టీమిండియా క్రికెటర్​ ధోనీ. ఐపీఎల్ నిరవధిక వాయిదా పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Is MS Dhoni going to be part of Syed Mushtaq Ali Trophy 2020/21?
సయ్యద్​ ముస్తక్​ అలీ ట్రోఫీ బరిలో ధోని!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మైదానంలో చూసి చాలా రోజులైంది. గతేడాది వన్డే ప్రపంచకప్​లో చివరగా ఆడిన మహీ.. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో బరిలోకి దిగి, భారత జట్టులో తిరిగి చోట్టు దక్కించుకోవాలని భావించాడు. అయితే కరోనా వల్ల ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ మనసు మార్చుకున్నాడని, వచ్చే ఏడాది జరిగే దేశవాళీ లీగ్​ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. లాక్​డౌన్ ముగిసిన తర్వాత దీనిపై స్పషత వచ్చే అవకాశముంది.

మహీ రీఎంట్రీ గురించి మాట్లాడిన ఝార్ఖండ్ క్రికెట్ సంస్థ ప్రతినిధి ఒకరు.. ఇప్పటికే జేఎస్​సీఏ అంతర్జాతీయ మైదానంలో ధోనీ ప్రాక్టీసుకు వచ్చాడని, ఆ సమయంలో అధికారులతో, సయ్యద్​ ముస్తాక్​ అలీ ట్రోఫీలో పాల్గొనే విషయమై చర్చించాడని తెలిపారు.

2007లో మాత్రమే ఝార్ఖండ్ తరఫున బరిలోకి దిగాడు ధోనీ. ఆ సీజన్​లో నాలుగు మ్యాచ్​లాడి 123 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి : 'అలా అయితే ఈ ఏడాది భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.