ETV Bharat / sports

Ben Stokes World Cup 2023 : షేర్​ ఆటోలో ఇంగ్లాండ్ క్రికెటర్స్​.. త్రుటి తప్పిన ప్రమాదం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2023, 1:10 PM IST

Ben Stokes World Cup 2023 : ప్రపంచకప్ పర్యటనలో భాగంగా భారత్​లో ఉన్న ఇంగ్లాండ్ జట్టుకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆ జట్టు ప్లేయర్​ బెన్​స్టోక్స్​ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వివరించాడు.

Ben Stokes World Cup 2023
Ben Stokes World Cup 2023

Ben Stokes World Cup 2023 : ఇంగ్లాండ్ జట్టులో కీలక పాత్ర పోషించే బెన్ స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఆట తీరుతో పాటు కెప్టెన్సీ స్కిల్స్​లో రాణిస్తున్న ఈ స్టార్ ఆల్ రౌండర్​ ప్రస్తుతం వన్డే ప్రపంచకప్​లో తన ఇన్నింగ్స్​ను కొనసాగిస్తున్నాడు. ఇక స్టోక్స్​తో పాటు అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో లియామ్ లివింగ్‌స్టోన్ కూడా పేరొందిన ప్లేయర్​. ప్రస్తుతం ఈ ఇద్దరూ వరల్డ్​ కప్​లో భాగంగా భారత్​లో పర్యటిస్తున్నారు. అయితే ఇటీవలే ఈ ఇద్దరు తృటిలో ఓ ప్రమాదాన్ని తప్పించుకున్నారట. ఈ విషయాన్ని బెన్ స్టోక్స్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఇటీవలే స్టోక్స్, లివింగ్‌స్టోన్ కోల్,​ ఆండీ మిచెల్‌తో కలిసి ఓ షేర్ ఆటోలో ఎక్కారు. చాలా స్పీడ్​గా వెళ్తున్న సమయంలో ఆ ఆటో ఓ కారును ఢీ కొట్టబోయింది. అయితే త్రుటిలో వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు స్టోక్స్​ ఓ వీడియో చూపించి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక బెన్​ స్టోక్స్​ గత ఏడాది జులైలో వన్డే ఇంటర్నేషనల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ తొలి మూడు మ్యాచ్‌లకూ రాలేదు. తుంటి సమస్యతో బాధపడుతున్న కారణంగా అతడు మొదటి మూడు గేమ్‌లకు దూరమయ్యాడు. అయితే అతని అవసరం పడటం వల్ల మళ్లీ అతడిని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వెనక్కి పిలిపించింది. అలా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్​ కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. అయినప్పటికీ ఇంకా కోలుకోనందున బెన్​ మునుపటిలా ఆడలేకపోతున్నాడు.

మరోవైపు అక్టోబరు 26న బెంగళూరు వేదికగా ఇంగ్లాండ్​ శ్రీలంకతో తలపడనుంది. ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఇంగ్లాండ్‌ ఓడింది. తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయంతో పుంజుకుంటుందనే అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా పసికూన అఫ్గానిస్థాన్‌ చేతిలో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పుడు సఫారీ సేన చేతిలోనూ చిత్తుచిత్తుగా ఓడి తమ వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త పరాజయాన్ని మూటగట్టుకుంది. 229 పరుగుల తేడాతో ఓడి.. పరుగుల పరంగా అతి పెద్ద ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరడం కాస్త కష్టమనే చెప్పాలి. ఇక ఇంగ్లాండ్​ తర్వాత ఆడబోయే ఐదు మ్యాచ్‌లూ తప్పకా గెలవాల్సిందే అని విశ్లేషకులు అంటున్నారు.

Ben Stokes VS New Zealand : 15 ఫోర్లు, 9 సిక్స్‌లతో బెన్​ స్టోక్స్ ఊచకోత.. డబుల్​ సెంచరీ జస్ట్ మిస్​!

Stokes Catch Drop : సూపర్ మ్యాన్​లా క్యాచ్ అందుకున్న స్టోక్స్.. అయినా అది నాటౌట్.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.