ETV Bharat / sports

IND VS AUS: మూడో మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి.. ఆసీస్​దే వన్డే సిరీస్​

author img

By

Published : Mar 22, 2023, 10:12 PM IST

Updated : Mar 22, 2023, 10:55 PM IST

మూడో వన్డేలో టీమ్​ఇండియాపై విజయం సాధించింది వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఆఖరి మ్యాచ్​లో 21 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్​.. 2-1తేడాతో సిరీస్​ను దక్కించుకుంది.

Australia won the third match and ODI series against Teamindia
IND VS AUS: మూడో మ్యాచ్​లో టీమ్​ఇండియా ఓటమి.. సిరీస్​ ఆసీస్​దే

విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో ఘోర ఓటమిని అందుకున్న టీమ్‌ఇండియా.. చెన్నై చిదంబకరం స్డేడియం వేదికగా జరిగిన మూడో వన్డేలోనూ ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. ఫలితంగా ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో భారత జట్టుపై విజయం సాధించింది ఆస్ట్రేలియా. దీంతో ఆసీస్​.. వన్డే సిరీస్​ను సొంతం చేసుకుని ఫుల్​ జోష్​గా సంబరాలు చేసుకుంది. ఈ మ్యాచ్​లో 21 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్​.. మూడు మ్యాచుల వన్డే సిరీస్​ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. 270 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్​ఇండియా.. 49.1 ఓవర్లలో 248 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. హాఫ్​ సెంచరీతో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ(54) టాప్​ స్కోరర్​. హార్దిక్ పాండ్య (40; 40 బంతుల్లో 3x4, 1x6) భారీ ఇన్నింగ్స్​ ఆడటానికి ప్రయత్నించినా కుదరలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ (30; 17 బంతుల్లో 2x4, 2x6) దూకుడుగా ఆడినా తక్కువ స్కోరు మాత్రమే చేసి ఔట్​ అయిపోయాడు. శుభ్‌మన్‌ గిల్ (37), కేఎల్ రాహుల్ (32) పర్వాలేదనిపించేలా ఆడారు. జడేజా(18), షమి (14), కుల్దీప్​ యాదవ్​(6) పరుగులు చేశారు. ఇకపోతో తొలి రెండు మ్యాచ్​ల్లోనూ గోల్డెన్​ డకౌట్​గా వెనుదిరిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (0).. ఈ మూడో మ్యాచ్​లోనూ మరోసారి గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్​ చేరాడు. చివర్లో వచ్చిన మహ్మద్​ సిరాజ్​(3*) నాటౌట్​గా నిలిచాడు. ప్రత్యర్థి జట్టు ఆసీస్​ బౌలర్లలో అడం జంపా నాలుగు వికెట్లు పడగొట్టగా.. అష్టన్ ఆగర్​ 2, మార్కస్​ స్టొయినిస్​, సీన్​ అబాట్​ ఓ వికెట్ తీశారు.

అంతకుముందు .. టాస్‌ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్​ చేసిన ఆసీస్‌.. 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 33, 4x4, 2x6 ), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 47, 8 x4, 1x6) రాణించారు. కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌ (0) డకౌటయ్యాడు. మిడిలార్డర్​లో అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 38, 2x4, 1x6) పర్వాలేదనిపించాడు. మార్నస్‌ లబుషేన్‌ (28), సీన్‌ అబాట్ (26), స్టాయినిస్ (25), డేవిడ్ వార్నర్‌ (23), అగర్‌ (17), మిచెల్ స్టార్క్ (10*), ఆడమ్ జంపా (10) రన్స్​ చేశారు. టీమ్​ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య(3/44), కుల్దీప్ యాదవ్(3/56) తలో మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. అక్షర్ పటేల్(2/57), మహ్మద్​ సిరాజ్(2/37) తలో రెండు వికెట్లు సాధించారు.

ఇదీ చూడండి: IND VS AUS: డక్, డక్, డక్.. మూడు వన్డేల్లోనూ సూర్య గోల్డెన్ డక్!

Last Updated : Mar 22, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.