ETV Bharat / sports

Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్​.. ఎవరి బౌలింగ్ ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 10:35 PM IST

Asia cup 2023 Ind VS Pak Bowling performance : ఆసియాకప్​లో పాక్‌ బౌలర్లు నేపాల్‌ను 104 పరుగులకు కట్టడి చేస్తే.. టీమ్​ఇండియా బౌలర్లు మాత్రం అందుకు రెట్టింపు స్కోర్‌ను సమర్పించుకున్నారు. ఆ వివరాలు...

Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్​.. ఎవరెలా బౌలింగ్ చేశారంటే?
Asia cup 2023 Ind VS Pak : భారత్ వర్సెస్ పాక్​.. ఎవరెలా బౌలింగ్ చేశారంటే?

Asia cup 2023 Ind VS Pak Bowling performance : ఆసియా కప్‌ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్‌ 4) పసికూన నేపాల్‌తో టీమ్​ఇండియా మ్యాచ్ ఆడింది. అయితే ఈ పోరులో భారత బౌలర్లు తమ స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదు. నేపాల్‌ జట్టు 200 పరుగుల స్కోర్ మార్క్​ను దాటిందంటే.. భారత బౌలర్ల వైఫల్యమే ఇందుకు కారణం అని చెప్పొచ్చు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లు నేపాల్‌ను 104 పరుగులకు కట్టడి చేస్తే.. టీమ్​ఇండియా బౌలర్లు మాత్రం అందుకు రెట్టింపు స్కోర్‌ను సమర్పించుకున్నారు.

Asia cup 2023 IND VS Nepal : ఈ మ్యాచ్‌లో టీమ్​ఇండియా బౌలింగ్‌లో లోపాలు బాగా కనిపించాయి. భారత పేస్‌ విభాగంలో లోపాన్ని నేపాల్‌ బ్యాటర్లు అవకాశంగా మలుచుకున్నారు. అనుభవజ్ఞుడైన షమీ 7 ఓవర్లలో ఒక్క వికెట్‌ మాత్రమే తీసి పేలవ ప్రదర్శన చేశాడు. వన్డే టాప్‌-10 బౌలర్లలో ఒకడైన సిరాజ్‌ వికెట్లు తీసినప్పటికీ.. అతడి బౌలింగ్‌ ఏమీ ఆకట్టుకునేలా లేదు. శార్దూల్‌ తూతూ మంత్రంగానే బౌలింగ్‌ చేశాడు. హార్దిక్‌, కుల్దీప్‌, జడేజాలు మాత్రం పర్వాలేదనిపించారు. అయినా ఇది కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన ఏమీ కాదని చెప్పొచ్చు. మొత్తంగా నేపాల్‌ బ్యాటర్లు టీమ్​ఇండియా బౌలింగ్ వైఫల్యాన్ని అవకాశంగా మార్చుకుని మంచి పోరాటపటిమను కనబరిచారు. టీమ్​ఇండియాకు231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

Asia cup 2023 PAK VS Nepal : ఇక ఇదే నేపాల్ టీమ్​పై పాకిస్థాన్​ బౌలర్ల ప్రదర్శన చూస్తే.. టీమ్​ఇండియా బౌలర్ల లోపాలు బాగా అర్థమవుతాయి. పాక్‌ బౌలర్లు సమిష్టిగా రాణించి.. నేపాల్​ను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. మొదట పేసర్లు షాహీన్‌ అఫ్రిది (2/27), హరీస్‌ రౌఫ్‌ (2/16), నసీం షా (1/17).. టెయిలెండర్లపై షాదాబ్‌ ఖాన్‌ (4/27), మహ్మద్‌ నవాజ్‌ (1/13) రెచ్చిపోయారు. దీంతో నేపాల్‌ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే డబుల్​ డిజిస్ట్​ స్కోర్లు (29 పరుగుల లోపే) చేశారు. ఈ లెక్కల ఆధారంగా చూస్తే.. భారత బౌలర్ల కన్నా పాక్‌ బౌలర్లు ఎలాంటి మంచి ప్రదర్శన చేశారో అర్థమవుతుంది.

కాబట్టి.. ఇలాంటి బౌలింగ్‌తో ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌, త్వరలో జరగబోయే వరల్డ్‌ కప్‌లో భారత్​ రాణించడం కాస్త కష్టం అవుతుందని, త్వరగా.. పేస్‌లో పదును పెంచి, స్పిన్‌లో నాణ్యతను పెంచాలని సూచిస్తున్నారు. అప్పుడే టీమ్​ఇండియా పైచేయి సాధిస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఇకపై భారత బౌలర్ల ప్రదర్శన ఎలా ఉంటుందో..

Asia Cup 2023 India VS Nepal : ఊహించిన దాని కన్నా నేపాల్ భారీ స్కోర్​.. భారత లక్ష్యం ఎంతంటే?

Asia Cup 2023 India VS Nepal : సూపర్ క్యాచెస్​.. కోహ్లీ సింగిల్ హ్యాండ్​తో​.. రోహితేమో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.