ETV Bharat / sitara

సినీ కార్మికుల కోసం నిర్మాణసంస్థ చొరవ

author img

By

Published : May 4, 2021, 12:34 PM IST

బాలీవుడ్​లోని సినీ కార్మికుల కోసం ప్రత్యేకమైన వ్యాక్సిన్​ డ్రైవ్​ నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు యష్​రాజ్​ ఫిల్మ్​ సంస్థ విన్నవించుకుంది. అయితే ఈ డ్రైవ్​లో 30 వేల మందికి అవసరమయ్యే మౌలిక సదుపాయాల ఖర్చును తాము భరిస్తామని హామీ ఇచ్చింది.

YRF requests Maha CM to help production house vaccinate 30,000 cine workers
సినీ కార్మికుల కోసం నిర్మాణసంస్థ చొరవ

దేశంలో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థ యష్​రాజ్​ ఫిల్మ్స్​ ముందుకొచ్చింది. ఫెడరేషన్​ ఆఫ్​ వెస్ట్రన్​ ఇండియా సినీ ఎంప్లాయిస్​(ఎఫ్​డబ్ల్యూఐసీఈ)లో 30 వేల మందికి టీకాకు అయ్యే ఖర్చును భరించేందుకు సిద్ధమని ఆ ప్రొడక్షన్​ హౌస్​ ప్రకటించింది. సినీ కార్మికులకు వెంటనే వాక్సిన్​ డ్రైవ్​ను నిర్వహించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రేకు యష్​రాజ్​ సంస్థ లేఖలో విన్నవించుకుంది.

"సుమారు 30 వేల మంది సినీ కార్మికులకు వ్యాక్సిన్లు అందించమని మా యష్​రాజ్​ ఫిల్మ్​ సంస్థ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈ వ్యాక్సిన్​ డ్రైవ్​ను సరైన రీతిలో నిర్వహించేందుకు మా సహకారాన్ని అందిస్తాం. టీకాలు వేసుకున్న తర్వాత సినీ కార్మికులంతా వారివారి కార్యాకలాపలకు కొనసాగించొచ్చని ఆశిస్తున్నాము".

- యష్​రాజ్​ ఫిల్మ్​ రాసిన లేఖ సారాంశం

ఫెడరేషన్​ ఆఫ్​ వెస్ట్రన్​ ఇండియా సినీ ఎంప్లాయిస్​(ఎఫ్​డబ్ల్యూఐసీఈ)లో మొత్తం 2.5 లక్షల మంది కార్మికులు ఉన్నారు. ఈ వ్యాక్యినేషన్​ ద్వారా కార్మికులకు రోజూ పని కల్పించడానికి వీలవుతుందని యష్​రాజ్​ సంస్థ అభిప్రాయపడింది. వ్యాక్సిన్​ డ్రైవ్​కు అవసరమయ్యే మౌలిక సదుపాయల ఖర్చును తాము భరిస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా యష్​రాజ్​ సంస్థకు ఎఫ్​డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్​ తివారీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: టాలీవుడ్ దర్శకులు.. వారి డ్రీమ్ ప్రాజెక్టులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.