ETV Bharat / sitara

'అమితాబ్​ సినిమాను రీమేక్​ చేయట్లేదు'

author img

By

Published : Oct 21, 2020, 8:32 PM IST

'నమక్​ హలాల్​' సినిమాను తన తండ్రి డేవిడ్​ ధావన్​ రీమేక్​ చేస్తున్నారంటూ వస్తోన్న వార్తలపై స్పందించారు హీరో వరుణ్​ ధావన్. అవన్నీ పుకార్లేనని​ స్పష్టం చేశాడీ బాలీవుడ్​ నటుడు.

Varun Dhawan rubbishes reports of Namak Halaal remake
'ఆ అమితాబ్​ సినిమాను మా నాన్న రీమేక్​ చేయట్లేదు'

బాలీవుడ్​ మెగాస్టార్​ అమితాబ్​ బచ్చన్.. 1982లో నటించిన సూపర్​హిట్​ చిత్రం 'నమక్​ హలాల్'. ఈ సినిమా​ను డేవిడ్​ ధావన్​ రిమేక్​ చేస్తున్నారనే వార్త.. బాలీవుడ్​లో ఇటీవల చక్కర్లు కొట్టింది. అయితే.. అవన్నీ పుకార్లేనని తేల్చాడు డేవిడ్​ కుమారుడు, నటుడు వరుణ్​ ధావన్​. ఓ మీడియా కథనాన్ని ట్విట్టర్​ వేదికగా షేర్​ చేసి.. ఇదంతా ఫేక్​ అని స్పష్టం చేశాడు.

  • Guys u can write how many ever make belief stories about me but don’t make up things about my dad. This is a completely fabricated story will see u christmas 🎄 to make u laugh. https://t.co/8u1FBd2DMr

    — VarunDhawan (@Varun_dvn) October 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

​"మీరు నా మీద నమ్మదగిన కథలను ఎన్నైనా అల్లుకోండి. కానీ, మా నాన్నపై ఇలాంటివి వద్దు. ఇది పూర్తిగా ఓ తప్పుడు వార్త. మిమ్మల్ని నవ్వించడానికి ఈ క్రిస్​మస్​కు వస్తున్నా"

-- వరుణ్​ ధావన్​, నటుడు.

1995లో వచ్చిన 'కూలీ నెం.1' రీమేక్​లో బిజీగా ఉన్నాడు వరుణ్​. ఈ సినిమాకు తన తండ్రి డేవిడ్​ ధావన్​ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్​కు జోడీగా సారా అలీ ఖాన్​ కనిపించనుంది. ఓటీటీ వేదికగా క్రిస్​మస్​కు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నాయి.

స్టూడెంట్​ ఆఫ్​ ది ఇయర్ మూవీ​తో బాలీవుడ్​లో అడుగు పెట్టిన వరుణ్.. ఇటీవలే ఎనిమిదేళ్ల కెరీర్​ పూర్తి చేసుకున్నాడు.

ఇదీ చూడండి:క్యాన్సర్​ను జయించిన సంజయ్ దత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.