ETV Bharat / sitara

మీ వదినను పరిచయం చేస్తా.. అభిమానులతో వరుణ్​

author img

By

Published : Dec 2, 2020, 3:35 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో వరుణ్​ధావన్​.. తన అభిమానులకు ఓ సర్​ప్రైజ్​ ఇవ్వనున్నారు. తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తానని వాళ్లకు చెప్పారు. వరుణ్ 'కూలీ నం.1' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Varun Dhawan promises to introduce someone special tomorrow
'మీ వదినను పరిచయం చేస్తా'.. అభిమానులకు వరుణ్​ హామీ

బాలీవుడ్​ హీరో వరుణ్​ ధావన్​.. తనపై వస్తున్న పుకార్లకు స్వస్తి పలకాలని నిర్ణయించారు. గురువారం తనకు సంబంధించిన ఓ విషయాన్ని చెబుతానని ఇన్​స్టా​లో వెల్లడించారు. "ఈ విషయాన్ని ఇకపై దాచిపెట్టాలనుకోవడం లేదు. రేపు(గురువారం) మీ వదినను మీ అందరికీ పరిచయం చేద్దామని నిర్ణయించుకున్నాను" అని వరుణ్​ ఆ వీడియోలో చెప్పారు.

వరుణ్​ ధావన్ ఇన్​స్టాగ్రామ్​ వీడియో

చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్​తో వరుణ్ రిలేషన్​లో ఉన్నట్లు ఎప్పటినుంచో ప్రచారం సాగుతోంది. అయితే ఈ వీడియోలో చెప్పిన వదిన వెండి తెరపైనా? లేదా నిజ జీవితంలోనా? అనే ఆలోచనలో పడ్డారు అతడి అభిమానులు. దీనిపై స్పష్టత రావాలంటే గురువారం వరకు వేచి చూడాల్సిందే. ​

క్రిస్​మస్​కు 'కూలీ నం.1'

వరుణ్​ ధావన్​, సారా అలీఖాన్ జంటగా నటించిన 'కూలీ నం.1'.. క్రిస్​మస్​ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.​ 1995లో వచ్చిన 'కూలీ నెం.1'కు ఇది రీమేక్​. డిసెంబరు 25న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. వరుణ్​​ తండ్రి డేవిడ్‌ ధావన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

ఇదీ చూడండి: ప్రేమించి పెళ్లిచేసుకున్నోడు 'కూలీ' అని తెలిస్తే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.