ETV Bharat / sitara

అలరిస్తున్న ప్రియాంక 'ద వైట్ టైగర్' ట్రైలర్

author img

By

Published : Oct 29, 2020, 3:32 PM IST

ప్రియాంక చోప్రా హీరోయిన్​గా నటించిన 'ద వైట్ టైగర్' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జనవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'The White Tiger' trailer
ద వైట్ టైగర్ సినిమా ట్రైలర్

ప్రియాంక చోప్రా-రాజ్​కుమార్ రావు నటిస్తున్న చిత్రం 'ద వైట్ టైగర్'. అరవింద్ అడిగా రాసిన 'ద వైట్ టైగర్' నవల ఆధారంగా దీనిని తెరకెక్కించింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్​ఫ్లిక్స్.

మన దేశంలో చిన్నచితకా ఉద్యోగాలు చేసే వారి కష్టాలు, పేదరికం, అవినీతి, బలహీన వర్గాల గురించి ఇందులో చూపించనున్నారు. ఓ ధనిక కుటుంబం దగ్గర పనికి కుదిరిన బలరామ్​కు జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది కథాంశం. రమీన్ భరాణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జనవరిలో ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఇది చదవండి: కొన్నిసార్లు నష్టపోయా, భయపడ్డాను: ప్రియాంక చోప్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.