ETV Bharat / sitara

Suriya40: గ్యాంగ్​రేప్​ కథతో సూర్య సినిమా!

author img

By

Published : Jun 28, 2021, 9:15 AM IST

సూర్య 40వ(Suriya) సినిమా ఓ గురించి ఓ వార్త చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ గ్యాంగ్ రేప్​ కేస్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని సమాచారం. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.

Suriya40
సూర్య

తమిళ స్టార్​ హీరో సూర్య(Suriya).. విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల 'ఆకాశం నీ హద్దురా' వంటి ప్రయోగాత్మక చిత్రంతో సూపర్​హిట్​ను అందుకున్న ఆయన.. ప్రస్తుతం తన 40వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం గురించి ఓ వార్త నెట్టింట్లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. యదార్థ ఘటన నేపథ్యంలో దీన్ని రూపొందించబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

తమిళనాడు పొల్లాచిలో రెండేళ్ల క్రితం జరిగిన గ్యాంగ్​రేప్​ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ అత్యాచార ఘటన నేపథ్యంలోనే సూర్య కొత్త సినిమా ఉండబోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అత్యాచారం చేసిన నేరగాళ్లను శిక్షించే పవర్​ఫుల్​ పాత్రలో సూర్య కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్​ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. జులై 23న సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్​కు సంబంధించి కొత్త అప్డేట్​ ఏమైనా వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూర్య.. ఈ మూవీతో పాటు మరో రెండు చిత్రాలు చేస్తున్నారు.

ఇదీ చూడండి: SureshRaina: క్రికెటర్ రైనా బయోపిక్​లో సూర్య?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.